Saturday, 15 August 2020

Allu Ayaan: గెట్ అవుట్ అంటూ రెచ్చిపోయిన అల్లు అర్జున్ తనయుడు.. అబ్బో! ఆ రోషం చూస్తే.. షాకింగ్ వీడియో

దేశం మొత్తానికి స్పెషల్ పండగైన స్వాతంత్ర్య దినోత్సవం వచ్చిందంటే చాలు ఇంట్లోని చిన్న పిల్లలకు స్వాతంత్ర్య సమరయోధుల వేషాలు వేసి వారిలో జాతీయ భావాలను పెంపొందించే ప్రయత్నం చేస్తుంటారు తల్లిదండ్రులు. ఈ క్రమంలోనే ఈ ఏడాది 74వ స్వాతంత్య దినోత్సవం సందర్భంగా దంపతులు తమ కొడుకు అల్లు అయాన్, అల్లు అర్హలకు స్వాతంత్ర్య సమరయోధుల గెటప్స్ వేసి ఆ బుడతలతో పదునైన డైలాగ్స్ చెప్పించారు. పైగా ఆ వీడియోలను అల్లు అర్జున్ స్వయంగా షేర్ చేయడంతో తెగ వైరల్ అయ్యాయి. కూతురు అల్లు అర్హకు ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం వ్యవస్థాపకులు మదన్ మోహన్ మాలవ్య గెటప్‌ అదేవిధంగా కొడుకు అల్లు అయాన్‌కి ఉద్యమ వీరుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి గెటప్ వేసి వాళ్ళిద్దరి చేత పదునైన నినాదాలు పలికించారు బన్నీ దంపతులు. ఇందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు అల్లు అర్జున్. Also Read: ఈ వీడియోల్లో మదన్ మోహన్ మాలవ్యగా ''సత్యమేవ జయతే'' అనే నినాదంతో ఆకట్టుకోగా.. అల్లు అయాన్ ఉయ్యాలవాడ నరసింహా రెడ్డిగా ''గెట్ అవుట్ ఆఫ్ మై మదర్ ల్యాండ్'' అంటూ రోషం చూపిస్తూ అదరగొట్టారు. ఈ రెండు వీడియోలు చూసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ మురిసిపోతూ లైకులతో హోరెత్తిస్తున్నారు. ‘‘ఫ్యూచర్ స్టార్స్, సూపర్, పిల్లలు కాదు పిడుగులు, ఇప్పుడే ఇంత రేషం ఉందంటే ఇక ముందుముందు’’ అంటూ ఆసక్తికర కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3g0K6QO

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....