Sunday, 16 August 2020

Upasana Kamineni: ఒకే ఇంట్లో ఉన్నా ఉపాసనను కలవలేని పరిస్థితి.. సీక్రెట్స్ బయటపెట్టిన రామ్ చరణ్

ప్రస్తుతం RRR మూవీ చేస్తున్న మెగా పవర్ స్టార్ లాక్‌‌డౌన్ కారణంగా గత నాలుగు నెలలకు పైగా ఇంటికే పరిమితమయ్యారు. కరోనా మహమ్మారి వీరవిహారం చేస్తున్న కారణంగా షూటింగ్స్‌కి దూరంగా ఉంటూ హోమ్ క్వారంటైన్‌లో ఉంటున్నారు. అయితే నిన్న (ఆగస్టు 15) స్వాతంత్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న చెర్రీ.. తన హోమ్ క్వారంటైన్ విశేషాలు, లాక్‌డౌన్ వేళ తన ఇంట్లో నెలకొన్న పరిస్థితులను ఓపెన్‌గా చెప్పేశారు. ఈ క్రమంలో భార్య గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంటూ సీక్రెట్స్ రివీల్ చేశారు . కరోనా కారణంగా ఫ్రంట్‌లైన్ వర్కర్స్ ఫుల్ బిజీ అయ్యారు. ముఖ్యంగా డాక్టర్లు క్షణం తీరిక లేకుండా శ్రమిస్తూ రోగులకు సేవలందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అపోలో హాస్పిటల్ పనులతో ఉపాసన చాలా బిజీ అయిపోయిందని, అపోలో హాస్పిటల్ చైర్ పర్సన్‌గా ఉన్న తాను ఇంటి నుంచే హాస్పిటల్‌కి సంబంధించిన పనులు చూసుకుంటోందని అన్నారు రామ్ చరణ్. దీంతో కనీసం ఒకరినొకరం కలుసుకునే పరిస్థితి కూడా లేకుండా పోయిందని ఆయన తెలిపారు. Also Read: ఇద్దరం ఓకే ఇంట్లో ఉన్నప్పటికీ.. కేవలం భోజనం సమయంలో మాత్రమే ఉపాసనతో మీట్ అవుతున్నానని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు. కాగా ఉపాసన లాంటి సామాజిక స్పృహ ఉన్న భార్య దొరకడం తన అదృష్టమని పేర్కొన్న చెర్రీ.. ఆమెతో లైఫ్ హాయిగా గడిచిపోతోందని చెప్పారు. ఇకపోతే తన RRR మూవీ షూటింగ్ రీ ఓపెన్ ఎప్పుడవుతుందో చెప్పలేమని తెలిపుతూ ఖచ్చితంగా ఈ సినిమాలో తన అల్లూరి సీతారామరాజు పాత్ర సరికొత్తగా ఉండి అందరినీ మెప్పిస్తుందని అన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2PXSV3C

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....