Saturday, 15 August 2020

Satish Vegesna: శ్రీహరి తనయుడు హీరోగా స‌తీశ్ వేగేశ్న‌ కొత్త సినిమా.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్

'శతమానం భవతి' చిత్రంతో తన టాలెంట్ చూపించి జాతీయ అవార్డు అందుకున్న దర్శకుడు సతీష్ వేగేశ్న తాజాగా యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ చిత్రాన్ని రూపొందించేందుకు రెడీ అయ్యారు. టాలీవుడ్ గ్రేట్ యాక్టర్ డా. , వేగేశ్న సతీష్ తనయుడు సమీర్ వేగేశ్న ఇద్దరూ ఈ సినిమాలో హీరోలుగా నటించనుండటం విశేషం. లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ మూవీని MLV సత్యనారాయణ (సత్తిబాబు) నిర్మించనున్నారు. నేడు (ఆగస్టు 15) దివంగత డా.శ్రీహరి గారి జయంతి సందర్భంగా ఈ సినిమాను అఫీషియల్‌గా ప్రకటించారు మేకర్స్. ఈ సందర్భంగా దర్శకుడు సతీష్ వేగేశ్న మాట్లాడుతూ "వరుసగా కుటుంబ కథా చిత్రాలు చేసాను. ఇప్పుడు ఓ మంచి పూర్తి స్థాయి వినోదభరితమైన సినిమా చేయబోతున్నాను. ప్రస్తుతానికి ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయింది. అన్ని పరిస్థితులు చక్కబడిన వెంటనే షూటింగ్ మొదలు పెడతాం" అన్నారు. Also Read: నిర్మాత MLV సత్యనారాయణ (సత్తిబాబు) మాట్లాడుతూ.. "సతీష్ గారు తీసిన 'శతమానం భవతి' చిత్రం నా మనసుకి బాగా నచ్చింది. ఇప్పుడు ఆయనతో సినిమా చేయడం సంతోషంగా ఉంది. ఈ మూవీ టైటిల్, హీరోయిన్స్, ఇతర సాంకేతికనిపుణుల వివరాలు త్వరలోనే ప్రకటిస్తాం'' అని తెలిపారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Y3Ijo0

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....