Wednesday, 19 August 2020

Samantha: ముద్దుల మామ నాగార్జునకు కోడలు సమంత స్వీట్ గిఫ్ట్.. రంగంలోకి దించుతోందిలా..

తెలుగు చిత్రసీమలో స్టార్ హీరోలంతా ఎవరికీ వారే ప్రత్యేకం. ఒక్కొక్కరిదీ అశేష అభిమాన వర్గం. సీనియర్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, మొదలుకొని ఆ తర్వాత తరం ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు, ప్రభాస్ వరకూ ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా అని చెప్పలేం. ఈ క్రమంలోనే తమ తమ అభిమాన హీరో పుట్టినరోజు వేడుకను పెద్ద పండగగా చేసుకుంటూ ఉంటారు ఫ్యాన్స్. అయితే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ప్రభావం మరింతగా పెరగడం, ప్రతి ఒక్కరికీ టెక్నాలజీ అందుబాటులోకి రావడం కారణంగా ఆన్‌లైన్ వేదికలపై తమ అభిమాన హీరోల బర్త్ డేలకు తెగ హంగామా చేస్తున్నారు ఫ్యాన్స్. అడ్వాన్స్ బర్త్ డే విషెస్, కామన్ డీపీలతో వారం.. పది రోజుల ముందు నుంచే సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. మరీ ముఖ్యంగా దక్షిణాది చిత్రసీమలో ఈ ట్రెండ్ ఎక్కువగా నడుస్తోంది. మేమంటే మేము అంటూ ఏకంగా వరల్డ్ రికార్డ్స్‌పై కన్నేసి హల్చల్ చేస్తున్నారు. ఓ హీరో ఫ్యాన్స్ చేసిన నమోదు చేసిన రికార్డును మరో హీరో ఫ్యాన్స్ బద్దలు కొట్టేలా సరికొత్తగా ప్లాన్స్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ మధ్య పవన్ కళ్యాణ్, మహేష్ బాబు అభిమానుల మధ్య పెద్ద యుద్ధం నడిచిన సంగతి తెలిసిందే. మహేష్ బర్త్ డే రికార్డును పవన్ ఫ్యాన్స్ అలవోకగా చెరిపేసి వరల్డ్ రికార్డ్‌ను తమ హీరో పేరిట లిఖించుకున్నారు. Also Read: ఇక ఇప్పుడు మెగా ఫ్యాన్స్ టైమ్ వచ్చేసింది. ఆగస్టు 22న జరగబోయే చిరంజీవి బర్త్ డే సందర్భంగా భారీ స్కెచ్ వేసిన మెగా ఫ్యాన్స్.. దేశ వ్యాప్తంగా 65 మంది సెలెబ్రిటీలతో కామన్ మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేయిస్తున్నారు. మరోవైపు కింగ్ నాగార్జున బర్త్ డే సందడి కూడా మొదలైంది. ఆగస్టు 29న నాగార్జున పుట్టినరోజు సందర్భంగా అక్కినేని ఫ్యాన్స్ తమ తమ సన్నాహాలు స్టార్ట్ చేసేశారు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా నాగార్జున బర్త్ డే హంగామా ఆయన కోడలు, స్టార్ హీరోయిన్ సమంతతో మొదలు పెట్టబోతున్నారు. ముద్దుల మామకు కోడలి స్వీట్ గిఫ్ట్ అందేలా.. ఆయన బర్త్ డే కామన్ డీపీని రిలీజ్ చేయబోతోన్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆగస్ట్ 23న సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్లు ట్వీట్ చేశారు అక్కినేని ఫ్యాన్స్. సో.. చూడాలి మరి నాగార్జునకు సమంత ఇచ్చే బహుమతి సోషల్ మీడియాను ఏ రేంజ్‌లో దున్నేస్తుందో!.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/327AQFQ

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....