లేటుగా వచ్చినా లేటెస్టుగా అన్నట్లుగా సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటున్నారు. తన వ్యక్తిగత విషయాలు, సినిమా సంగతులు పంచుకుంటూనే ప్రస్తుత పరిస్థితులు, స్పెషల్ డేస్ ఇలా అన్నింటిపై స్పందిస్తూ డిజిటల్ మెగాస్టార్ అనిపించుకుంటున్నారు. ఈ క్రమంలోనే నిన్న (ఆగస్టు 19) సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఒక వింటేజ్ ఫొటోను షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఇది తాను తీసిన మొదటిఫొటో అని పేర్కొంటూ ‘ఈ ఐదుగురిలో ఒక వ్యక్తి మీకు బాగా తెలుసు.. చెప్పుకోండి చూద్దాం’’ అని అభిమానులను ప్రశ్నించారు చిరంజీవి. అయితే ఈ ఫొటో చూసిన నెటిజన్లు చిరంజీవి ప్రశ్నపై పెద్దఎత్తున రియాక్ట్ అయ్యారు. ఆ పాత మధురాన్ని చూసి ఎంజాయ్ చేస్తూ.. ఇంకెవరు ఆ ఫొటో ఉన్న వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆ ఐదుగురిలో సరిగ్గా మధ్యలో ఉన్నాడు అంటూ రియాక్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో నెటిజన్ల స్పందనపై హ్యాపీగా ఫీల్ అయిన చిరంజీవి.. ''ఎస్..మీ గెస్ రైట్. ఆ ఐదుగురు మధ్యలో ఉన్న మూడో వ్యక్తి నా చిన్న తమ్ముడు పవన్ కళ్యాణ్. ఇది నేను తీసిన రెండో ఫోటో. మా నాన్నగారు'' అంటూ మరో వింటేజ్ ఫొటో ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. Also Read: ఆ రోజుల్లో బాగా ఫేమస్ అయిన ద్విచక్ర వాహనం సైకిల్. ఆ సైకిల్‌కి హెడ్ లైటు కూడా ఉందంటే మరీ గ్రేట్. అలాంటి హెడ్ లైట్ ఉన్న సైకిల్‌తో చిరంజీవి తండ్రి గారైన కొణిదెల వెంకట్రావును ఈ ఫొటోలో చూసి మురిసిపోతున్నారు మెగా ఫ్యాన్స్. కొణిదెల వెంకట్రావు ఓ కానిస్టేబుల్ అనే విషయం మనందరికీ తెలుసు. బహుశా ఈ ఫొటో కూడా చిరంజీవి సొంతూరు మొగల్తూరులోనే తీసి ఉండొచ్చు. మరోవైపు చిరంజీవి పోస్ట్ చేసిన ఈ మధురమైన ఆ పాత జ్ఞాపకాలను మెగా ఫ్యాన్స్ ప్రత్యేకంగా భద్రపర్చుకుంటున్నారు. ఇక చిరంజీవి సినిమాల విషయానికొస్తే.. కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య'గా కెమెరా ముందుకొచ్చిన ఆయన, లాక్‌డౌన్ కారణంగా షూటింగ్‌కి దూరమై ఇంట్లోనే ఉంటున్నారు. కరోనా విలయతాండవం తగ్గాకే తిరిగి కెమెరా ముందుకొస్తారట. చిరు కెరీర్‌లో 152వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్‌ను ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈనెల 22న విడుదల చేయనున్నారు. చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ నటిస్తోంది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Qfspm5
No comments:
Post a Comment