దిగ్గజ గాయకుడు ఆరోగ్య పరిస్థితిపై తాజాగా చెన్నై ఎంజీఎం ఆసుపత్రి డాక్టర్స్ అప్‌డేట్ ఇచ్చారు. గత రెండు వారాలుగా కోవిడ్ చికిత్స పొందుతున్న గానగంధర్వుడు ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారు. ఈ క్రమంలో బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం క్రమంగా కోలుకుంటోందని తెలుపుతూ ఎప్పటికప్పుడు ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ సమాచారమిస్తున్నారు. అయితే తాజాగా ఆసుపత్రి వర్గాలు విడుదల చేసిన హెల్త్ బులెటిన్ మరోసారి అందరిలో ఆందోళన నింపింది. బుధవారం సాయంత్రం హెల్త్ బులెటిన్ విడుదల చేసిన డాక్టర్స్.. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని తెలిపారు. వైద్య నిపుణుల పర్యవేక్షణలో ప్రస్తుతం వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. కాలేయం మినహా అన్ని అవయవాలు పనిచేస్తున్నాయని, విదేశీ వైద్యుల సూచనల మేరకు ఎక్మో పరికరంతో బాలుకి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. మరికొద్ది రోజుల్లో ఆయన ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉందని ఈ బులెటిన్ ద్వారా తెలిపారు. Also Read: మరోవైపు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ.. ఇటు అభిమానులు, అటు సినీ సెలబ్రిటీలు పెద్దఎత్తున ప్రార్ధనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలంగాణ ఆర్ధిక మంత్రి ట్వీట్ చేశారు. ''తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో తన పాటలతో దశాబ్దాల కాలంగా సంగీత ప్రియులను మంత్రముగ్దులను చేసిన లెజెండరీ సింగర్ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం మెరుగుపడి.. తిరిగి అందరినీ అలరించారని కోరుకుంటున్నా'' అని పేర్కొన్నారు హరీష్ రావు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/322XizS
No comments:
Post a Comment