Saturday, 15 August 2020

Namrata Shirodkar: ఇద్దరు పిల్లలు సేఫ్.. చాలా సంతోష పడుతున్నాం.. నమ్రత శిరోద్కర్‌ ఎమోషనల్ కామెంట్స్

సూపర్ స్టార్ కేవలం సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ సూపర్ స్టారే అనే విషయం తెలిసిందే. తన సతీమణి నమ్రత శిరోద్కర్‌తో కలిసి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తుంటారు మహేష్ బాబు. ఇప్పటికే ఈ శ్రీమంతుడు తెలుగు రాష్ట్రాల్లో రెండు పల్లెటూళ్లను దత్తత తీసుకుని సొంత ఖర్చుతో అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న సంగతి మనందరికీ తెలుసు. దీంతోపాటు నిరుపేద చిన్నారుల ఆరోగ్యంపై దృష్టి సారించిన ఈ సైనికుడు.. ఆంధ్రా హాస్పిటల్స్ సహకారంతో చిన్నారులకు హార్ట్ ఆపరేషన్స్ చేయిస్తూ నిరుపేదల గుండెల్లో గూడు కట్టుకుంటున్నారు. ఇప్పటికే 1000కి పైగా చిన్నారులకు హార్ట్ స‌ర్జ‌రీలు చేయించి రియ‌ల్ హీరో అనిపించుకున్నారు మహేష్ బాబు. ఆయన చేసే ఈ బృహత్తర సేవా కార్యక్రమాలకు మహేష్ సతీమణి నమ్రత సహాయ సహకారాలు, అండదండ ఎప్పటికీ ఉంటాయనేది అందరికీ తెలిసిన వాస్తవం. ఈ క్రమంలోనే తాజాగా ఆంధ్రా ఆసుపత్రిలో ఇద్దరు చిన్నారుల హార్ట్ ఆపరేషన్ సక్సెస్ కావడంతో వారి ఫోటోలు షేర్ చేస్తూ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఎమోషనల్ కామెంట్స్ చేసింది నమ్రత. Also Read: ''నా హృదయాన్ని కదిలించేలా ఆంధ్ర హాస్పిటల్‌తో సంబంధం కలిగి ఉండటం ఎంతో గర్వకారణం. చిన్న పిల్లల డాక్టర్ పి.వి.రామారావు, అతని డాక్టర్స్ బృందం ఇద్దరు చిన్నారులకు ఊపిరి పోశారు. భవ్య శ్రీ, సింధు కోలుకున్నారని.. ఆరోగ్యంగా ఉన్నారని తెలిసి చాలా సంతోష పడుతున్నాం. ఆ ఇద్దరు చిన్నారులు వారి కుటుంబాలకు దీవెనలు. సురక్షితంగా, హాయిగా ఉండండి'' అని నమ్రత పేర్కొంది. ఈ పోస్ట్ చూసిన సూపర్ స్టార్ ఫ్యాన్స్ మహేష్ దంపతుల సామాజిక స్పృహను తెగ పొగిడేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3kT624m

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....