Saturday, 15 August 2020

ఎస్పీ బాలుకు ప్లాస్మా చికిత్స .. మరో రెండు రోజులు వెంటిలేటర్‌పైనే

సినిమా ఇండస్ట్రీలో కరోనా కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు కరోనా బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే తాజాగా ఆయన సతీమణి సావిత్రి బాల సుబ్రహ్మణ్యం కూడా కరోనా వైరస్ బారిన పడ్డారు. కొన్నిరోజుల కిందటే బాల సుబ్రహ్మణ్యంకు వైరస్ సోకింది. ఆయనకు చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే వయసు పైబడిన వారు కరోనా నుంచి కోలుకోవడం అనేది ఇప్పుడు కాస్త సవాల్ గా మారింది. ముఖ్యంగా సినీ ప్రముఖుల్లో వయసు మీద పడిన వారికి చికిత్స అందించడం వైద్యులకు పలు ఇబ్బందులకు గురి చేస్తోంది. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్యం ఇప్పుడు విషమం అయింది. ఆయన కరోనా లక్షలతో ఆస్పత్రిలో చేరగా కరోనా పాజిటివ్ వచ్చింది. మొన్నటి వరకు నిలకడగా ఉన్న ఆయన ఆరోగ్యం, విషమంగా అకస్మాత్తుగా మారడంతో ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు వెంటిలేటర్ పై ఆయనను ఉంచి చికిత్స అందించారు. రెండు రోజుల నుంచి ఆయన వెంటిలేటర్ మీద ఉంటూ వైద్యం తీసుకుంటున్నారు. ఆయనకు కరోనా కాస్త తీవ్రంగా మారడంతో ఇప్పుడు ప్లాస్మా చికిత్స చేయాలని వైద్యులు నిర్ణయానికి వచ్చారు. ఇటీవల ప్లాస్మా నుంచి చాలా మంది ప్రముఖులు కోలుకున్నారు. Read More: ఢిల్లీ ఆరోగ్య శాఖా మంత్రి కూడా ప్లాస్మా నుంచే కోలుకున్నారు. తాజాగా తమిళనాడు మంత్రి విజయ భాస్కర్‌ను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలును పరామర్శించారు. ఆస్పత్రికి వెళ్లి చికిత్స జరుగుతున్న వివరాల్ని ఆయన సేకరించారు. అంతేకాదు ఎస్పీ బాలుకు అయ్యే వైద్య ఖర్చుల్ని కూడా ప్రభుత్వమే భరిస్తుందన్నారు. కరోనా నుంచి కోలుకునేందుకు బాలుకు ప్లాస్మా చికిత్స కూడా అందిస్తున్నామని మంత్రి తెలిపారు. మరో రెండు రోజలు పాటు వెంటిలేటర్ పైనే ఉంచి బాలుకు చికిత్స అందిస్తామన్నారు. మరోవైపు ఆయన భార్య కూడా కరోనా బారిన పడటంతో ఆమెకు కూడా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3iLVkup

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....