Monday, 10 August 2020

పెళ్లి కాకపోతే నేనిప్పుడు పదో తరగతిలో ఉండేదాన్ని: అనసూయ ఆంటీ సెగలు

జబర్దస్త్ హాట్ యాంకర్ అనసూయ‌ ఆంటీ అంటే అన్నవాడికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన సందర్భాలు అనేకం. ఆంటీ ఏంట్రా.. ఆంటీ అని అంతెత్తున లేచే వయసు 35 నుంచి వెనక్కి వెళ్తుందేమో అన్నట్టుగా తన గ్లామర్‌తో కుర్రకారుకి కిక్కెస్తుంది. జబర్దస్త్‌ కామెడీ షోలో అనసూయ అందానికి ముగ్ధులయ్యే వారు చాలా మందే ఉంటే.. రంగమ్మత్త సినిమాలతోనూ సత్తా చూపిస్తోంది. అందం.. అభినయం.. ఆకట్టుకునే విధానం.. అన్నింటికీ మించి పాపులర్ అయ్యే రూటుని ఒడిసిపట్టుకున్న అనసూయ వందమందిలో ఉన్నా.. కెమెరాల ఫోకస్ తనపై ఉండేందుకు బాగా కష్టపడుతూ ఉంటుంది. తాజాగా సుమ హోస్ట్ చేసే క్యాష్ షోకి సెలబ్రిటీగా ఎంట్రీ ఇచ్చిన అనసూయ సెంటరాఫ్ అట్రాక్షన్ అయ్యింది. ఎల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్ స్కట్‌లో ఎప్పటిలాగే తన అందాలతో కనువిందు చేసింది. ఈ డ్రెస్‌కి తగ్గట్టుగానే వెరైటీ హెయిర్ స్టైల్‌తో కనువిందు చేసింది అనసూయ. అంతేకాదు తనకు పెళ్లి కాకుండా ఉంటే.. పదో తరగతి చదివేదాన్ని అంటూ పలు ట్రోల్స్‌కి తావిచ్చింది. ఈ షోలో అనసూయతో పాటు శేఖర్ మాస్టర్, హైపర్ ఆది, రష్మిలు కూడా ఈ షోలో సందడి చేస్తున్నాడు. హైపర్ ఆది ఉంటే.. అందులోనూ పక్కన అనసూయ ఉంటే.. హైపర్ పంచ్‌లకు పరిధి ఉండదు. తాజాగా క్యాష్ ప్రోమోలోనూ పంచ్‌ల ప్రవాహాన్ని చూపించారు. ఢీ, జబర్దస్త్ ఇతర షోలలో పులిహోర కలుపుతూ ఈమధ్య బుల్లితెర మన్మధుడిగా మారిన కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్‌కి పులిహోరతో స్వాగతం పలికి పంచ్ ఇచ్చింది యాంకర్ సుమ. ‘పులిహోర బౌల్ తీసుకుని ఇందులో మిర్చీ ఎందుకు వేశారో అర్థం కావట్లా’ అని శేఖర్ మాస్టర్ అనడంతో.. ‘ఓహో మీరు కలిపే పులిహోరలో పులిహోర ఉండదా? మాస్టర్’ అంటూ ఎంట్రీలోనే వరస పంచ్‌లతో ఆటాడుకుంది సుమ. ఇక రష్మి సైతం పులిహోర అందుకుని.. ‘మాస్టర్ గారూ మీరు కలిపారా?’ అనడం.. అనసూయ కూడా పులిహోర తీసుకుని ‘అప్పుడేనా మాస్టర్.. పులిహోర కలిపేశారా?’ అంటూ బౌల్ అందుకుంది. ‘శేఖర్ మాస్టర్ కలిపిన తరువాత కూడా ఇంత పులిహోర మిగిలిందా??’ అంటూ హైపర్ పంచ్‌తో ఎంట్రీ ఇచ్చిన హైపర్ ఆది.. ‘షూటింగ్‌కి ఏజ్ లిమిట్ పెట్టారు కదా.. అసలు మీ అందర్నీ ఎవరు పిలిచారు? అంటూ సుమ, అనసూయ, రష్మి, శేఖర్ మాస్టర్‌లకు పంచ్ వేశాడు. దీంతో రంగంలోకి దిగిన రష్మి.. ‘హలో నేను ఇప్పుడు యాంకర్ కాకపోయి ఉంటే.. ఇంటర్‌లో ఉండేదాన్ని’ అంటూ పంచ్ వేసింది. ఇక పక్కనే ఉన్న అనసూయ.. ‘నా పెళ్లి అవ్వకపోయి ఉంటే ఇప్పటికి పదో తరగతి చదివేదాన్ని’ అంటూ కామెడీ చేస్తూ ఓ రేంజ్ ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చింది. ‘హా.. సర్ సర్లే నేను జడ్జీ అవ్వకపోయి ఉంటే నడక నేర్చుకుంటూ ఉండేవాడ్ని’ అంటూ శేఖర్ మాస్టర్ సైతం పులిహోర కలిపారు. ఇది హో కాకపోయి ఉంటే నేను ఉరేసుకుని ఉండేవాడ్ని అంటూ హైపర్ ఆది ప్రేక్షకుల ఆలోచల్ని తన పంచ్‌లో చేర్చాడు. అవునూ.. ఇంతకీ ఆవిడ (సుమ) ఏం మాట్లాడదేంటి అంటే.. ‘నాకు ఇంకా ఊహ తెలియదు.. ఏం మాట్లాడుతున్నారు మీరు’ అంటూ మైండ్ బ్లాక్ చేసేసింది యాంకర్ సుమ. ఈమె దెబ్బకు అనసూయ వంగి వంగి నమస్కారం పెట్టగా.. ‘కరోనా చైనాలో పుట్టిందని తెలిసింది.. కాని మీరు ఎప్పుడు పుట్టారో ఎవరికీ తెలియడం లేదు.. అదొక్కటీ చెప్పండమ్మా’ అంటూ పంచ్ వేశాడు ఆది. ఇక ఆది గున్న గున్న మామిడి స్టెప్.. శేఖర్ మాస్టర్, రష్మిలకు నేర్పించడం.. తన కిల్లీ కొట్టు ఓపెనింగ్‌కి రిబ్బన్ కటింగ్ కోసం యాంకర్ అనసూయను పిలవడం.. ఆమెతో రష్మి, సుమలో ఒక్క ఫొటో అని మీద పడటం పొట్ట చెక్కలు చేసింది. మధ్యలో రష్మి.. ‘నీక్కావలసింది.. నా దగ్గర ఉంది.. నువ్ సచ్చిపో.. నేను సచ్చిపోతా.. అందరం సచ్చిపోతాం’ అంటూ డైలాగ్‌ని చంపేసింది. చివర్లో సుమ బ్రేకింగ్ న్యూస్ చదువుతూ కామెడీతో పిచ్చెక్కించింది. ఈ సరదా సరదా ‘క్యాష్‌’ ప్రోమోకి చివర్లో ఎమోషనల్ టచ్ ఇచ్చారు. యాంకర్ రష్మి లాక్ డౌన్‌లో తిండిలేక ఇబ్బందులు పడుతున్న మూగజీవాల ఆకలి తీర్చుతూ అందరితో శెభాష్ అనిపించుకున్న వీడియోలను ప్లే చేశారు. మొత్తానికి క్యాష్ ప్రోమోలో రష్మి, అనసూయ, శేఖర్ మాస్టర్, ఆది, సుమలు ఫుల్ ఫన్ అందించి పూర్తి స్థాయిలో వినోదాన్ని పంచారు. ఈ కార్యక్రమాన్ని మల్లెమాల ఎంటర్ టైన్మెంట్స్‌ వారు ఈటీవీలో ఆగష్టు 15న ప్రసారం చేయనున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/30Itycf

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....