Monday, 10 August 2020

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. కరోనాతో ప్రముఖ నిర్మాత కన్నుమూత

ప్రపంచాన్నే అల్లకల్లోలం చేస్తున్న కరోనా మహమ్మారి మన దేశంలో కోరలు చాస్తూ విలయతాండవం చేస్తోంది. నిత్యం వేలల్లో కేసులు, వందల్లో కరోనా మరణాలు నమోదవుతుండటం అశేష ప్రజానీకాన్ని కలవరపెడుతోంది. సాధారణ ప్రజలు, సెలబ్రిటీ అనే తేడా లేకుండా కరోనా కాటుకు ఎంతోమంది బలైపోతున్నారు. తాజాగా ప్రముఖ కోలీవుడ్ నిర్మాత, నటుడు వీ. స్వామినాథన్(62) కరోనాతో కన్నుమూశారు. దీంతో కోలీవుడ్ వర్గాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నిరోజులుగా కరోనా వైరస్‌తో బాధపడుతున్న స్వామినాథన్.. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు (ఆగస్టు 11) తెల్లవారు జామున మరణించారు. కే మురళీధరన్, వేణుగోపాల్ వంటి నిర్మాతలతో కలిసి లక్ష్మీ మూవీ మేకర్స్ బ్యానర్ స్థాపించిన స్వామినాథన్‌కి రెండు దశాబ్ధాలకు పైగా చిత్రసీమతో అనుబంధం ఉంది. ఈ బ్యానర్‌పై అరణ్‌ మనై కావలన్‌ అనే చిత్రాన్ని తొలిసారిగా 1994లో నిర్మించారు. ఆ తర్వాత మరెన్నో సినిమాలు నిర్మించిన ఆయన అజిత్, విజయ్, కమల్ హాసన్, సూర్య, కార్తిక్‌ వంటి తమిళ స్టార్ హీరోలతో కలిసి పనిచేశారు. స్వామినాథన్ కుమారుడు అశ్విన్‌ కూడా నటుడే. తమిళ సినీ ఇండస్ట్రీతో గొప్ప అనుబంధం ఉన్న స్వామినాథన్ మరణవార్త తెలిసి పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా రియాక్ట్ అవుతున్నారు. మంచి మిత్రుడిని కోల్పోయామంటూ ఆవేదన చెందుతున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/30Lmvzu

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....