Saturday, 1 August 2020

మోహన్ బాబు ఇంట్లో హల్చల్ చేసిన దుండగులు అరెస్ట్.. కాల్ డేటా ఆధారంగా పోలీసుల దర్యాప్తు!

సీనియర్ నటుడు ఇంటి వద్ద (ఆగస్టు 1) గత రాత్రి హల్చల్ చేసిన వ్యక్తులను కొద్దిసేపటి క్రితం పోలీసులు పట్టుకున్నారు. వారిని అరెస్ట్ చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లో ఎంట్రన్స్ లోనే ఉన్న మోహన్ బాబు ఇంటిలోకి కారులో వచ్చిన కొంతమంది దుండగులు ఆయన ఫ్యామిలీని తీవ్రంగా హెచ్చరించి వెళ్లిపోయారు. దీంతో మోహన్‌బాబు కుటుంబ సభ్యులు పహాడి షరీఫ్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ వ్యక్తుల ఆచూకీ రాబట్టి అరెస్ట్ చేశారు. ఏపీ 31 AN‌ 0004 ఇన్నోవా కారులో దుండగులు వచ్చినట్లుగా మోహన్‌బాబు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ, కార్ నెంబర్ ఆధారంగా ఆగంతకులను పట్టుకున్నారు. మోహన్ బాబు ఇంటికి వచ్చి బెదిరింపులకు పాల్పడింది మైలార్‌దేవ్ పల్లి లోని దుర్గా నగర్‌కు చెందిన నలుగురు యువకులుగా పోలీసులు గుర్తించారు. ఆ నలుగురినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి కాల్ డేటాను పరీశీలిస్తున్నారు. ఆగంతకులు కావాలనే ఈ పని చేశారా? లేక ఎవరైనా పంపించారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు సాగుతోంది. Also Read: సాదారణంగా మోహన్ బాబు ఇంటికి కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. ఇంటికి పెద్ద గేట్ ఉండటమే కాకుండా సెక్యురిటీ సిబ్బంది కట్టుదిట్టంగానే ఉంటుంది. అయినా ఇలా కారులో దూసుకొచ్చి హల్చల్ చేస్తూ మోహన్ బాబు ఫ్యామిలీకి వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఆ స్థాయి శత్రువులు ఎవరున్నారు? అనే చర్చ జనాల్లో మొదలైంది. చూడాలి మరి పోలీసుల విచారణలో ఎలాంటి నిజాలు బయటకొస్తాయనేది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3glbpGx

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....