
మరికొద్ది రోజుల్లోనే మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు రాబోతోంది. ఆగస్టు 22వ తేదీన ఆయన 65వ పుట్టినరోజు జరుపుకోబోతున్నారు. ఈ సందర్భంగా ఇప్పటి నుంచే మెగా ఫ్యాన్స్ ఆయన బర్త్ డే హంగామా స్టార్ట్ చేశారు. మెగాస్టార్‌కి అడ్వాన్స్ బర్త్ డే విషెస్ చెబుతూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. కాగా మెగాస్టార్ కానుకగా ఫ్యాన్స్ ఓ స్పెషల్ సాంగ్ రిలీజ్ చేయబోతుండటం విశేషం. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన పుట్టినరోజు కంటే ముందు రోజే రాష్ట్ర రామ్ చరణ్ యువ శక్తి ఓ స్పెషల్ సాంగ్ విడుదల చేయబోతోంది. మెగాస్టార్ పేరుతో విడుదల కానున్న ఈ పాటను వెంకటాద్రి టాకీస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, రాష్ట్ర రామ్ చరణ్ యువ శక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు శివ చెర్రీ నిర్మించారు. ఈ సాంగ్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను శనివారం సాయంత్రం 7గంటలకు విడుదల చేశారు. ఈ నెల 21న ఈ మెగా ర్యాప్ సాంగ్ విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. Also Read: గతంలో రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా శివ చెర్రీ నేతృత్వంలో విడుదలైన స్పెషల్ సాంగ్ పలువురి ప్రశంసలు అందుకుంది. సినీ ప్రముఖులు ప్రత్యేకంగా ఈ పాట గురించి కొనియాడారు. మెగా ర్యాప్‌కు కూడా అలాంటి ఆదరణే లభిస్తుందని శివ చెర్రీ ఆశిస్తున్నారు. మరోవైపు చిరంజీవి చేస్తున్న తాజా మూవీ 'ఆచార్య' నుంచి కూడా ఏదైనా సర్‌ప్రైజ్ ఉంటుందేమో అని ఆసక్తిగా ఇఫుడు చూస్తున్నారు మెగా ఫ్యాన్స్.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3hWFSv4
No comments:
Post a Comment