
వరుస కాంట్రవర్సీ సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న మరో సంచలన ప్రకటన చేశారు. అంతా ఊహించినట్లుగానే మెగా ఫ్యామిలీని మరోసారి టార్గెట్ చేస్తూ ''పై సినిమా అనౌన్స్ చేశారు. తన తదుపరి చిత్రం ‘అల్లు’ అని ట్విట్టర్ ద్వారా తెలిపిన వర్మ వరుస ట్వీట్స్ చేస్తూ ఆ సినిమా విశేషాలు తెలిపారు. టార్గెట్ మెగా కాంపౌండ్ అనే హింట్ ఇస్తూ ఎక్కడా నేరుగా పేర్లు ప్రస్తావించకుండా తన రెగ్యులర్ ఫార్ములానే వాడేశారు. ఇటీవలే పవన్ కళ్యాణ్ టార్గెట్‌గా 'పవర్ స్టార్' సినిమాను విడుదల చేసి సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన వర్మ.. ఈ 'అల్లు' ప్రకటనతో తిరిగి అందరి దృష్టిని తనపై పడేలా చేసుకున్నారు. RGV వరల్డ్ థియేటర్ నుంచి నిజమైన ఘటనల ఆధారంగా మరో కల్పిత గాధ రాబోతుందని, దాని పేరు ''అల్లు'' అని తెలిపారు. అంతటితో ఆగక.. ఈ మూవీ ఓ పెద్ద స్టార్ బావమరిదికి సంబంధించిన స్టోరీ అని, ఆ బడా స్టార్ 'జన రాజ్యం' పార్టీ అనౌన్స్ చేశాక జరిగిన సంఘటనలతో ఈ మూవీ రూపొందుతోందంటూ మరో రచ్చకు తెరలేపారు రామ్ గోపాల్ వర్మ. “అల్లు” అనే టైటిల్ ఎందుకు పెట్టామంటే ఇందులోని మెయిన్ క్యారెక్టర్ రకరకాల ప్లాన్స్ “అల్లు”తూ ఉంటాడని తెలిపిన ఆర్జీవీ.. ''తనకి మంచి జరగాలి అంటే ప్లాన్ అల్లు, మరొకడికి చెడు జరగాలి అంటే ప్లాన్ అల్లు అనే స్ట్రాటర్జీతో ప్లాన్‌ల అల్లుడులో ఆరితేరిపోయి, పెద్ద స్టార్ అయిన తన బావ పక్కనే ఉంటూ తన మైలేజీ పడిపోకుండా ఉండటానికి తమ ఇంటి “అల్లు”డు అని కూడా మర్చిపోయి ఎప్పటికప్పుడు ప్లాన్లు అల్లుతూ ఉంటాడు'' అంటూ మరో ట్వీట్ చేశారు. Also Read: అందరితో తనని "ఆహా" అనిపించుకోవటానికి తనకి కావాల్సిన వాళ్ళకే మంచి జరిగేలా చెప్పి ప్లాన్ల మీద ప్లాన్ అల్లుకుపోతూ ఉండే ఒక పెద్ద అల్లికల మాస్టర్ కథే ఈ "అల్లు" అని పేర్కొంటూ సంచలనం సృష్టించిన రామ్ గోపాల్ వర్మ.. ఈ సినిమాలో ఎ.అరవింద్, కే.చిరంజీవి, ప్రవన్ కళ్యాణ్, ఎ. అర్జున్, ఎ.శిరీష్, కె.ఆర్.చరణ్, ఎన్. బాబు తదితరులు నటించనున్నట్లు పేర్కొన్నారు. ఆ కుటుంబం అంటే ఎంతో ప్రేమ అని, తనను నికృష్ణుడు అని పిలిచిన అల్లు అరవింద్‌పై ప్రతీకారం తీర్చుకోవడానికి తీసే సినిమా కాదని వర్మ క్లారిటీ ఇవ్వడం గమనార్హం. సో.. చూడాలి మరి ఈ మూవీపై మరిన్ని వివాదాలు రాజుకుంటాయో!.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2XlPgR3
No comments:
Post a Comment