Friday, 14 August 2020

స్వాతంత్ర్య దినోత్సవం 2020: తెలుగు సినిమాల్లో దేశభక్తిని రగిలించే పదునైన డైలాగ్స్..

ఈ రోజు (ఆగస్టు 15) భారత దేశానికి ఓ పండగ రోజు. ప్రతి ఏడాది దేశం గర్వించదగ్గ ఈ రోజున ఘనంగా స్వాతంత్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటూ నరనరాల్లో ఇమిడి ఉన్న దేశభక్తిని చాటుకుంటూ ఉంటారు అశేష భారతీయులు. అదే బాటలో ఈ ఏడాది ఆగస్టు 15న దేశమంతా 74వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటోంది. ఈ సందర్భంగా తెలుగు చిత్రాల్లోని దేశభక్తిని రగిలించే పదునైన డైలాగ్స్, పాటలు మనందరి కోసం మీ ముందుంచుతున్నాం. తెలుగు సినిమాల్లో దేశంపై ప్రేమను చాటుకుంటూ రోమాలు నిక్కబొడిచే డైలాగులతో ఆకట్టుకున్నారు మేకర్స్. అల్లూరి సీతారామ రాజు, ఖడ్గం, రోజా, భారతీయుడు, మేజర్ చంద్రకాంత్, బొబ్బిలి పులి సినిమాల్లోని కొన్ని డైలాగ్స్ సగటు భారతీయుడి గుండెల్లోని దేశభక్తిని రగిలిస్తూ మనసును హత్తుకుంటాయి. ఖడ్గం (2002) నుంచి శివాజీ రాజా డైలాగ్.. కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన ఖడ్గం మూవీలో దేశభక్తిని రగిలించేలా అన్ని మతాల వారు ఒక్కటే అని చూపించే సన్నివేశాలు ప్రతి భారతీయుడి హృదయాన్ని హత్తుకున్నాయి. హైదరాబాద్ నగరాన్ని అన్ని మతాలకు చిహ్నంగా చూపిస్తూ పదునైన డైలాగ్స్ తో ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో మిలిటరీ ఆఫీసర్ గా శివాజీ రాజా, భారత సైనికుల త్యాగం గురించి వివరించిన ప్రకాష్ రాజ్, రవితేజ నటన డైలాగ్స్ మనలోని దేశభక్తిని రగిలించాయి. ఆజాద్ (2000) సినిమాలో ప్రకాష్ రాజ్ డైలాగ్.. ఆజాద్ సినిమాలో పాకిస్తాన్ ఉగ్రవాది, భారత పోలీసు అధికారి మధ్య ఘర్షణ దృశ్యాన్ని చూపిస్తూ రగిలించారు. ప్రకాష్ రాజ్ చెప్పిన కొన్ని డైలాగ్స్ భారతదేశంలో హిందూ, ముస్లింల మధ్య మత సామరస్యాన్ని వివరించాయి. తిరుపతిసామి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నాగార్జున హీరోగా నటించారు. అల్లూరి సీతారామరాజు(1974) లో కృష్ణ డైలాగ్.. తెల్లోడి గుండెల్లో గుబులు పుట్టించిన స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జీవిత కథ ఆధారంగా 'అల్లూరి సీతారామరాజు' మూవీ రూపొందించారు. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా సూపర్ స్టార్ కృష్ణ అద్భుతమైన నటన కనబర్చారు. భారతీయ హృదయాలను ప్రేరేపించే డైలాగులతో ఆకట్టుకున్నారు. సుభాష్ చంద్రబోస్ (2005) సినిమాలో వెంకటేష్ డైలాగ్.. మేజర్ చంద్రకాంత్ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ చెప్పిన పదునైన డైలాగ్స్.. రోజా సినిమాలోని పవర్‌ఫుల్ సీన్స్.. రీసెంట్‌గా వచ్చిన మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సాంగ్..


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2E1zrIC

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....