Sunday, 3 May 2020

రాజమౌళి రామాయణం తీయాలి... ట్విట్టర్‌లో ట్రెండింగ్

సినిమా వస్తుందంటే తెలుగు అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఇది ఒకప్పటి మాట ఇప్పుడు మాత్రం రాజమౌళి సినిమా అంటే.. దేశంలో ఉన్న ఫ్యాన్స్‌తో పాటు... ఇతర దేశాలవాళ్లు కూడా ఇంట్రస్ట్‌గా చూస్తూ ఉంటారు. బాహుబలి సినిమాతో దర్శక ధీరుడు రాజమౌళి క్రేజ్ ఖండంతరాలు దాటేసింది. అయితే తాజాగా ట్విట్టర్‌లో కూడా రాజమౌళి పేరు ట్రెండ్ అవుతోంది. రాజమౌళిని కోడ్ చేస్తూ నెటిజన్స్ అంతా రిక్వెస్ చేస్తున్నారు. అందులో ఉత్తరాది ప్రజలే ఎక్కువగా మెసేజులు పెడుతున్నారు. ఇంతకీ వాళ్లు పెడుతున్న రిక్వెస్టులు ఏంటి ? అనేది కదా మీ సందేహం. మరేం కాదు రాజమౌళి మరో సినిమా తీయాలి. అదే రామాయణం. ‘ రాజమౌళి తీయాలి’ అంటూ ప్రస్తుతం ట్విట్టర్‌లో ట్రెండ్ నడుస్తోంది. వింటే రామాయణం వినాలి.. తింటే గారెలే తినాలి అన్న నానుడి భారతీయులకు బాగా తెలుసు. మన తెలుగు ప్రజలకు ఇంకా బాగా తెలుసు. రామాయణం అంత గొప్ప కావ్యం మరెక్కడా ఉండదు. ఆ కథ వింటుంటే కూడా మనసంతా ఆనందంతో పులకించిపోతుంది. అలాంటి రామాయణం సినిమాలద్వారానో, టీవీల్లో కూాడ వచ్చినప్పుడు కూడా భక్తులంతా ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. ఇక రామనంద్ సాగర్ తెరకెక్కించిన 'రామాయణ్' ఇటీవల డీడీలో పునః ప్రసారం అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ సీరియల్ రికార్డు క్రియేట్ చేసింది. 77మిలియన్‌ వ్యూయర్స్‌తో 'గేమ్ ఆఫ్‌ థ్రోన్స్'ను బీట్ చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అంతటి ప్రాముఖ్యత గల రామయణాన్ని రాజమౌళి తెరకెక్కించాలని నెటిజన్లు రిక్వెస్ట్ చేస్తున్నారు. తన విజువల్స్‌తో ఇప్పటి తరానికి తగ్గట్లుగా రాజమౌళి మాత్రమే అద్భుతంగా 'రామాయణ్‌'ను తెరకెక్కించగలరని వారు కామెంట్లు పెడుతున్నారు. రామాయణం తీస్తే రాజమౌళియే తీయాలని నెటిజన్స్ అంతా పోస్టు చేస్తున్నారు. మరికొందరు ఔత్సాహికులు అయితే రాముడు మీకోసం వెయిట్ చేస్తున్నాడంటూ కూడా పోస్టులు పెడుతున్నారు. రామాయణం లాంటి మాస్టర్ పీస్ తీయాలంటే.. అది రాజమౌళికే సాధ్యం అంటున్నారు. మరి నెటిజన్స్ రిక్వెస్ట్‌కు జక్కన్న ఎలా స్పందిస్తారో చూడాలి. ఇప్పటికే మహాభారతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని పలుమార్లు రాజమౌళి ప్రకటించారు. ఈ సినిమాను తాను కచ్చితంగా తెరకెక్కిస్తానని ఆయన అన్నారు. ప్రస్తుతం రాజమౌళి ఎన్టీఆర్, రామ్‌ చరణ్‌లతో ఆర్ఆర్ఆర్‌ తెరకెక్కిస్తున్నారు. లాక్ డౌన్‌తో ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ పడింది. ఆ తర్వాత మహేష్ బాబుతో ఓ మూవీ చేయబోతున్నారు రాజమౌళి. ఈ క్రమంలో మహా భారతం కూడా ఇప్పట్లో తెరకెక్కడం కష్టమే. మరి రామాయణం తీసేందుకు రాజమౌళి మనసులో మాటేంటో తెలియాలంటే... ఆయన దీనిపై స్పందించాల్సిందే.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3fkMzqv

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....