Saturday, 30 May 2020

మహేష్ బాబు పాటతో మైండ్ బ్లాక్ చేసిన డేవిడ్ వార్నర్

సంక్రాంతి పండగకి వచ్చి తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన సినిమా అనిల్ రావిపూడి కంబినేషన్ లో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’. థియేటర్ల వద్ద కలెక్షన్ల వర్షం కురిపించి.. బ్లాక్ బస్టర్ కా బాప్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా సాంగ్స్ కూడా బాగా ఫేమస్ అయ్యాయి. అందులో మైండ్ బ్లాక్ పాటకు వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంత కాదు. ఈ పాటలో మహేష్ స్టెప్పులు, రష్మిక చిందుల్ని అందర్నీ కట్టిపడేశాయి. తాజాగా ఈ పాటకు ప్రముఖ ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్, సన్ రైజర్స్ హైదరాబాద్ టీం కెఫ్టెన్ స్టెప్పులేశాడు. తన భార్యతో కలిసి మైండ్ బ్లాక్ పాటకు డాన్స్ వేసి నెటిజన్స్‌ను ఫిదా చేశాడు. డేవిడ్ వార్నర్‌పై మహేశ్ బాబు ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇస్తానంటూ నిన్నే సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. కరోనాతో ఇంటికే పరిమితమైన ఈ ఆసీస్ క్రికెటర్ టిక్‌టాక్‌లో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తెలుగు డైలాగ్స్, పాటలతో అభిమానుల ఉర్రూతలూగిస్తున్నాడు. తన వైఫ్ క్యాండిస్‌తో కలిసిఅదరగొడుతున్నాడు. అల్లు అర్జున్ పాటలకు కూడా వార్నర్ చిందులేసిన విషయం తెలిసిందే. అలవైకుంఠపురం మూవీలోని 'రాములో రాములా'‌తో మొదలెట్టి 'బుట్టబొమ్మ'తో అదరగొట్టాడు. వార్నర్ వీడియోలపై అల్లు అర్జున్ సైతం స్పందించాడు. ఇక మహేష్ బాబు బ్లాక్ బస్టర్ మూవీ పోకిరి, ప్రభాస్ బాహుబలి డైలాగ్స్‌తో మెప్పించి తెలుగు ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తున్నాడు. అంతే కాదు కమల్ హాసన్ పాటకు కూడా వార్నర్ డాన్స్ వేశాడు. దాదాపు అందరి హీరోలను కవర్ చేసిన వార్నర్.. అందరివాడయ్యాడు. దీంతో ఆయా హీరోల అభిమానులు వార్నర్‌కు స్పెషల్ రిక్వెస్ట్‌లు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోరిక మేరకు పక్కా లోకల్ సాంగ్‌తో బర్త్‌డే విషెస్ చెప్పి వారిని ఆనందంలో ముంచెత్తాడు. వార్నర్ సౌతిండియన్ స్టార్స్‌ను సంబంధించి టిక్ టాక్ చేయడంతో తెలుగు అభిమానులకు ఇప్పుడు వార్నర్‌ మరింత దగ్గరవుతున్నాడు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3dsQwYs

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....