గత కొన్ని రోజులుగా అనేక విషయాలపై స్పందిస్తూ వస్తున్న మెగా బ్రదర్, జనసేన నాయకుడు నాగబాబు తాజాగా కృష్ణ బర్త్ డే సందర్భంగా కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా ఆయన సూపర్ స్టార్ కృష్ణకు ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణ గురించి నాగబాబు పలు విషయాలు తెలిపారు. 'నా అభిమాన నటుల్లో ఒకరైన కృష్ణ పుట్టినరోజు సందర్భంగా నేను కొన్ని విషయాలను ఆయన గురించి చెప్పాలనుకుంటున్నాను. మెగాస్టార్ శకం ప్రారంభం కాకముందు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు నాలుగు స్తంభాల్లా అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీఆర్, శోభన్ బాబు, కృష్ణగారు ఉండేవారు. నా అభిప్రాయం ప్రకారం కృష్ణ గారు ట్రెండ్ సెట్టర్' అని అన్నారు నాగబాబు. అంతేకాదు 'మొదటి 70 ఎంఎం, డీటీఎస్, సినిమాస్కోప్, ఈస్ట్‌మన్ కలర్, స్పై సినిమాలు ఆయనవే. ఆయన మంచి మనసు ఉన్న వ్యక్తి.. చాలా మందికి సాయం చేశారు' అని నాగబాబు ట్వీట్ చేశారు. ఆయనను ఎప్పుడూ మరిచిపోలేం. ఆయనకు ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుంటుూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నానని చెప్పారు నాగబాబు. ఇక పోతే కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే. కృష్ణతో దిగిన ఫోటోని షేర్ చేస్తూ స్పెషల్ విషెస్ అందించారు చిరు. కథానాయకుడిగా 345 సినిమాలు దర్శకుడిగా 14 చిత్రాలు.నిర్మాతగా తెలుగుతో పాటు భారతీయభాషల్లో 50 చిత్రాలు.మొదటి సినిమాస్కోప్ సినిమా ఆయనదే.మొదటి 70mm చిత్రం కూడా ఆయనదే.అనితరసాధ్యం ఈ ట్రాక్ రికార్డ్. సాహసానికి మారుపేరు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత, సూపర్ స్టార్ కృష్ణ గారికి జన్మదినశుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. చిరుతో పాటు టాలీవుడ్‌కు చెందిన ఎందరో ప్రముఖులు కృష్ణకు బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2yOuMrb
No comments:
Post a Comment