ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె ఇంట శుభకార్యం జరిగింది. ఆయన కుతురుకు నిశ్చితార్థం నిర్వహించారు. రీసెంట్‌గా తన కూతురు రాఘ ఎంగేజ్‌మెంట్‌ని ఆశిష్ వర్మ అనే వ్యక్తితో జరిగింది. దీంతో రఘు కూతురు నిశ్చితార్ధానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రఘుది ప్రేమ వివాహం. కరుణ అనే క్లాసికల్ డాన్సర్‌ను ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. అమ్మాయి రాగ పుష్యమి.. గీతార్థ్ అనే అబ్బాయి ఉన్నారు. తాజాగా అమ్మాయి రాగకే నిశ్చితార్థం నిర్వహించారు రఘు దంపతులు. రఘుది తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి దగ్గర గాదరాడ అనే ఊరు. బాచి మూవీతో రఘు మ్యూజికల్ జర్నీ మొదలైంది. బాచీ సినిమాలో రఘు పాడిన లచ్చిమి లచ్చిమి పాటకు పేరు రావడంతో ఆయనకు అవకాశాలు రావడం మొదలయ్యాయి. తరువాత చిరంజీవి తన మృగరాజు సినిమాలో ఒక పాటను పాడే అవకాశం కల్పించాడు. తరువాత దేశముదురు, శివమణి లాంటి చిత్రాల్లో పాడిన పాటలతో కెరీర్ మరింత పుంజుకుంది. మరో పక్క వినీత్, అబ్బాస్, అరవింద్ స్వామి, దీపక్ లాంటి చాలామందికి డబ్బింగ్ కూడా చెప్పాడు. సంపంగి సినిమాకు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా నంది పురస్కారాన్నీ అందుకున్నాడు. బంపర్ ఆఫర్ సినిమాతో సంగీత దర్శకుడిగా మారాడు. ఆ సినిమాలో రఘు పాడిన పెళ్ళెందుకే రవణమ్మా అనే పాట మంచి ప్రేక్షకాదరణ పొందింది. అదే సినిమా సంగీత దర్శకుడిగా నంది అవార్డు లభించింది. మర్యాద రామన్న సినిమాలో కీరవాణి.. రఘుకు రాయె రాయె సలోనీ పాట పాడే అవకాశం ఇచ్చాడు. ఆ పాట కూడా మంచి విజయం సాధించింది. రఘు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సంగీత దర్శకుడిగానే కాకుండా సింగర్‌గా, యాంకర్‌గా, నటుడిగాను అలరించాడు. ముఖ్యంగా తన వాయిస్‌తో లక్షలాది ప్రజల ఆదరాభిమానాలు పొందాడు రఘు. 600కి పైగా పాటలు పాడిన రఘు 5 నంది అవార్డులు కూడా అందుకున్నారు. అనేక టీవీ కార్యక్రమాలకు వ్యాఖ్యతగా అలరించాడు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3cfGgS7
No comments:
Post a Comment