Friday 29 May 2020

ఫేస్ మాస్క్‌‌తో ఈ సమస్యలు వస్తాయ్, జాగ్రత్త!

రోనా వైరస్ నేపథ్యంలో అంతా ఇప్పుడు ఫేస్‌ మాస్కులను ధరించాల్సి వస్తున్న సంగతి తెలిసిందే. వైరస్ ఒకరి నుంచి ఒకరికి వ్యాపించకుండా ఉండేందుకు వీటిని ధరించడం తప్పనిసరి. కానీ, అతిగా మాస్కులను ధరించి ఉండటం కూడా అంత మంచిది కాదు. మాస్కుల వల్ల చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అతిగా మాస్కులను ధరించినట్లయితే చర్మంపై రాపిడికి గురవుతుంది. ఫలితంగా దురద, దద్దుర్లు, గీతలు ఏర్పడతాయి. వాటి వల్ల ముఖం మండుతుంది. అలాగే, వాడిన మాస్కునే పదే పదే వాడితో కొత్త ఇన్ఫెక్షన్లు చర్మంపై దాడి చేయవచ్చు. మాస్కులు శుభ్రంగా లేకపోతే శ్వాసకోస సంబంధిత సమస్యలు కూడా వస్తాయి. ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే కింది చిట్కాలను పాటించండి. మాస్క్‌ల వల్ల వచ్చే సమస్యలు ఇవే: ❂ మాస్క్‌లను ఎక్కువ సేపు ధరించేవారిలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గుతున్నట్లు ఇటీవల ఓ స్టడీలో పేర్కొన్నారు. ❂ చిన్న పిల్లలు ఎక్కువ సేపు మాస్క్ ధరించడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ❂ సింథ‌టిక్ మాస్క్‌లు పెట్టుకొనేవారి ముఖంపై ద‌ద్దుర్లు వ‌స్తున్నాయి. ❂ మాస్క్ వల్ల ఊపిరి పీల్చుకోడానికి ఇబ్బంది పడతారని, దీనివల్ల గుండెపై అధిక భారం ప‌డుతుందని స్టడీలో తేలింది. ❂ మాస్కులు అతిగా ధరిస్తే న్యూమోనియా ఏర్పడే ప్రమాదం ఉంది. ❂ రెండేళ్ల కంటే ఎక్కువ వ‌యసున్న పిల్లలు మాత్రమే ఫేస్ మాస్కుల‌ు ధరించాలని అమెరికన్ సీడీసీ వెల్లడించింది. ❂ స్కిన్ అలర్జీలు ఉన్నవారు మాస్కులతో మరింత జాగ్రత్తగా ఉండాలి. Also Read: ఈ జాగ్రత్తలు పాటించండి: ✺ నీరు ఎక్కువగా తాగాలి. దీనివల్ల చర్మం హైడ్రేట్ అవుతుంది. ఫలితంగా ముఖంపై దద్దుర్లు, మంట తగ్గుతాయి. ✺ మాస్క్ లేదా ముసుగు ధరించడానికి ముందు ముఖానికి ఫేస్‌క్రీమ్ రాయండి. ✺ ఫేస్‌క్రీమ్ రాసిన 20 నిమిషాల తర్వాత ముఖానికి మాస్క్ పెట్టుకోవడం మంచిది. ✺ మాస్క్ వల్ల మంట ఎక్కువగా ఉన్నట్లయితే యాంటీ బాక్టీరియల్ క్రీమ్ రాసుకోండి. ✺ మాస్క్ తీసిన వెంటనే ముఖాన్ని చేతులతో ముట్టుకోవద్దు. ✺ మాస్క్ తీసిన తర్వాత చేతులను శానిటైజర్ లేదా సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత ఫేస్‌వాష్‌తో ముఖాన్ని కడగాలి. ✺ మాస్క్ తీసిన తర్వాత చర్మంపై ముడతలు, మచ్చలు ఏర్పడతాయి. వాటిని అలాగే వదిలేస్తే శాస్వత మచ్చలుగా మిగిలిపోతాయి. అలా జరగకూడదంటే వాసలిన్ లేదా మరేదైనా క్రీమ్ రాయండి. ✺ ముఖానికి ఎక్కువగా చెమట పడితే సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది. కాబట్టి మాస్క్ పెట్టుకొనే ముందు ఆయిల్‌ఫ్రీ క్రీమ్‌ను వాడండి. ✺ N95, N 99, కాట‌న్‌ మాస్క్‌లే సురక్షితం. ఇళ్లల్లో తయారు చేసుకునే మాస్కులు కూడా మంచివే. ✺ స్కిన్ అలర్జీలతో బాధపడేవారు శుభ్రమైన మాస్కులను ధరించాలి. ముఖానికి సౌకర్యవంతంగా ఉండే మాస్కులనే పెట్టుకోవాలి. Also Read:


from Beauty Tips in Telugu: అందం చిట్కాలు, Homemade Natural Beauty Tips Telugu - Samayam Telugu https://ift.tt/2AjuJnH

No comments:

Post a Comment

'I Feel I Fail Shah Rukh'

'I'm happy piggybacking on his stardom.' from rediff Top Interviews https://ift.tt/b1euMKc