Sunday, 31 May 2020

అఫీషియల్: కరణం మల్లీశ్వరి బయోపిక్ అనౌన్స్.. మరో పాన్ ఇండియా మూవీ!

ప్రస్తుతం వెండితెరపై బయోపిక్స్ హవా నడుస్తోంది. గొప్ప వ్యక్తుల జీవిత చరిత్ర, వారి వారి గొప్పతనాన్ని, సాధించిన విజయాలను వెండితెరపై చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు నేటితరం ప్రేక్షకులు. దీంతో ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగానే బయోపిక్స్ రూపొందించేందుకు ముందుకొస్తున్నారు దర్శకనిర్మాతలు. ఈ క్రమంలోనే తాజాగా ఒలింపిక్స్‌లో ప‌తకం సాధించిన తొలి భార‌తీయ మ‌హిళ అనౌన్స్ చేశారు కోన వెంకట్. ఈ రోజు (జూన్ 1) క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రి పుట్టిన‌రోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్ వివరాలు తెలుపుతూ అఫీషియల్ ప్రకటన చేశారు. ఒలింపిక్స్ మెడల్ సాధించిన తొలి భారతీయ మహిళ క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రి జీవిత చరిత్రను వెండితెరపై ఆవిష్కృతం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్ ద్వారా ఆమెకు బర్త్ డే విషెస్ తెలిపారు. ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ‌, ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట. Also Read: అయితే ఈ చిత్రంలో క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రి కనిపించబోయే హీరోయిన్ ఎవరనేది మాత్రం ప్రకటించకపోవడంతో అందరిలోనూ ఆసక్తి మొదలైంది.ఈ చిత్రంలో టాలీవుడ్ హీరోయిన్‌ని తీసుకుంటారా? లేక బాలీవుడ్ భామను ఫైనల్ చేస్తారా? అనే దానిపై అప్పుడే చర్చలు మొదలయ్యాయి. అతిత్వరలో ఈ విషయమై అధికారిక ప్రకటన రానుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3cmngl9

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....