ఎన్టీఆర్ 98వ జయంతి సందర్భంగా సైతం ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్‌తోను ఉద్దేశిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. ‘తెలుగు జాతి పౌరుషం, తెలుగు వారి ఆత్మగౌరవం తెలుగు నేల గుండెల్లో ఎన్నటికీ చెదరని జ్ఞాపకం, నందమూరి తారక రామారావుగారి కీర్తి అజరామరం. వారితో కలిసి నటించడం నా అదృష్టం. పుట్టినరోజునాడు ఆ మహానుభావుని స్మరించుకుంటూ...’ అంటూ చిరు ట్వీట్ చేశారు. ఎన్టీఆర్‌తో కలిసి దిగిన ఫోటోను కూడా షేర్ చేశారు. ఈ ఫోటోలో చిరు ఎన్టీఆర్‌కు, ఎన్టీఆర్ చిరుకు స్వీట్స్ తినిపించే ఫోటోను షేర్ చేశారు. చిరంజీవి, ఎన్టీఆర్ 1981లో ‘తిరుగులేని మనిషి’అనే సినిమాలో కలిసి నటించారు. ఇందులో రతి అగ్నిహోత్రి, ఫటాఫట్ జయలక్ష్మీ హీరోయిన్లుగా నటించారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో దేవీ వర ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. కేవీ మహదేవన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ లాయర్ పాత్రలో, సింగర్ పాత్రలో నటించి మెప్పించారు. 1981 ఏప్రిల్ 1న ఈ సినిమా విడుదలైంది. వెండితెరపైనే కాదు... రాజకీయాల్లో కూడా ఎన్టీఆర్ తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. తెలుగు జాతి గౌరవం నిలబెట్టేలా తెలుగుదేశం పార్టీ స్థాపించారు. ఇటు సినిమాలతోను అటు రాజకీయాలతోను తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ఎన్టీఆర్ భౌతికంగా మన మధ్య లేకపోయిన సినిమాలతోను లేదంటే విప్లవాత్మక పథకాలతో ప్రజల మనసులలో చిరస్థాయిగా నిలిచిపోయారు. వెండితెరపై పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలు పోషించిన ఎన్టీఆర్.. పౌరాణిక పాత్రల్లో కూడా నటించి మెప్పించారు. తెరపై రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు, రావణాసురుడు, భీముడు, కర్ణుడు ఇలా ఎన్నో రూపాలలో అలరించారు. దాదాపు 400 చిత్రాల్లో నటించిన ఎన్టీఆర్ కేవలం నటుడిగా మాత్రమే కాకుండా.. నిర్మాతగా, దర్శకుడిగా కూడా కళామ్మతల్లికి ముద్దుబిడ్డ అయ్యారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3errg57
No comments:
Post a Comment