Sunday, 31 May 2020

అవసరాలు ఎక్కడికైనా తీసుకెళ్తాయి.. అయినా తప్పు చేయనపుడు భయమెందుకు: రామ్ గోపాల్ వర్మ

ఎప్పుడూ వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంటూ తన అభిప్రాయాలు, ఆలోచనలను స్వేచ్ఛగా పంచుకుంటూ సెన్సేషన్ క్రియేట్ చేయడం స్టైల్. తనకేదనిపిస్తే అది మీడియా ముందే నిర్మొహమాటంగా బయటపెట్టే ఆయన.. ఈ కరోనా పరిస్థితుల్లో మరింత హల్చల్ చేశారు. కరోనా వైరస్‌పై తనదైన కోణంలో కామెంట్స్ చేసిన వర్మ.. అదే కరోనా వైరస్‌పై మూవీ కూడా రూపొందించారు. అయితే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలులో ఉండగా ఈ మూవీ ఎలా షూట్ చేశారు? ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించారా? అనే దానిపై జనాల్లో నెలకొన్న అనుమానాలను తెరదించేలా తాజా ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు చెప్పారు రామ్ గోపాల్ వర్మ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లాక్‌డౌన్ నిబంధనలకు అనుగుణంగానే తాను వ్యవహరించానని, రూల్స్ ఫాలో అవుతూనే కరోనావైరస్ సినిమాను రూపొందించడం జరిగిందని అన్నారు వర్మ. తాను తీసుకొన్న నిర్ణయంలో ఎలాంటి లొసుగులు లేవని ఆయన అంటున్నారు. సినీ పరిశ్రమకు సంబంధించిన ఏ యూనియన్ సభ్యుడిని షూటింగ్ కోసం తీసుకోలేదని, ఎవరినీ సంప్రదించలేదని ఆయన తెలపడం విశేషం. అయితే తమ పరిధిలోనే అన్నిరకాల జాగ్రత్తలు తీసుకొని ఈ సినిమాను షూట్ చేయడం జరిగిందని వర్మ తెలిపారు. Also Read: నిబంధనలకు అనుగుణంగా నడచుకొన్నప్పుడు ఎవరి అనుమతి తీసుకోనవసరం లేదని, అలాగే తప్పు చేయనప్పుడు ఎవరికి తలవంచనవసరం అస్సలు లేదని పేర్కొంటూ మరోసారి తన నైజం బయటపెట్టారు వర్మ. కరోనావైరస్ మూవీని లాక్‌డౌన్ అమలులోకి వచ్చిన వారం రోజుల తర్వాత ప్రారంభించి.. ప్రభుత్వం జారీ చేసిన అన్ని రకాల లాక్‌డౌన్ నిబంధనలు పాటిస్తూ లాక్‌డౌన్ ముగిసే లోపే కంప్లీట్ చేశామని ఆయన చెప్పడం గమనార్హం. తన నా ఆలోచనలను విజన్‌కు అనుగుణంగా మల్చుకున్నానని, అవసరాలు ఎక్కడికైనా తీసుకెళ్తాయని సంచలన కామెంట్ చేశారు వర్మ. మరోవైపు ఓటీటీ వేదికపై రిలీజ్ చేసేందుకు గాను శృంగార తార మియా మాల్కోవాతో 'క్లైమాక్స్' సినిమా ఫినిష్ చేశారు వర్మ. ఈ మూవీ టీజర్, ట్రైలర్ రిలీజ్ చేసి అట్రాక్ట్ చేసిన ఆయన.. జూన్ 6వ తేదీన ఆర్జీవీ వరల్డ్ థియేటర్ అనే ఆన్‌లైన్ వేదికపై రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. మొత్తానికి ఇదంతా చూస్తుంటే సినీ పరిశ్రమ అంతా కరోనా కారణంగా నాలుగు గోడల మధ్యే ఉంటే వర్మ మాత్రం తనపని తాను చేసుకుంటూ వెళ్లి మరోసారి విలక్షణత చాటుకున్నాడని తెలుస్తోంది కదూ!.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/36M3k9W

No comments:

Post a Comment

'I Focused On Studying Charles Sobhraj'

'The opportunity to live as the Serpent excited me.' from rediff Top Interviews https://ift.tt/AtWXqwk