Wednesday, 27 May 2020

Samantha: పూజా హెగ్గే ఇన్‌స్టా‌లో సమంతపై అభ్యంతరకర వ్యాఖ్యలు

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతపై ఇన‌స్టాగ్రామ్ వేదికపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది. అయితే ఈ వ్యాఖ్యలు చేసింది పూజ మాత్రం కాదు. పూజా ఇనస్టా ఎకౌంట్ పొద్దున్న హ్యాకింగ్‌కు గురైన విషయం తెలిసిందే. ఆమె ఎకౌంట్ హ్యాక్ చేసిన హ్యాకర్ ఇలా సమంతపై అభ్యంతరకర పోస్టు చేశాడు. దీంతో ఈ విషయం తెలుసుకున్న పూజా తన ఎకౌంట్ నుంచి వచ్చిన ఇన్విటేషన్స్ ను ఎవరూ పట్టించుకోవద్దని రిక్వెస్ట్ చేసింది. ఎలాంటి వ్యక్తిగత సమాచారాన్ని ఆ అకౌంటుతో షేర్‌ చేసుకోవద్దని తెలిపింది. తన అకౌంటును ఎవరో హ్యాక్ చేశారని తన డిజిటల్‌ టీమ్‌ తనకు తెలిపిందని ఆమె ట్విట్టర్‌ ఖాతాలో అభిమానులకు చెప్పింది. ఎట్టకేలకు తన అకౌంట్‌ తన చేతుల్లోకి తిరిగి వచ్చినట్లు మరో ట్వీట్ చేసింది పూజా. ప్రస్తుతం ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను ఆమె డిజిటల్ టీమ్‌ సరి చేసిందని తెలిపింది. ఈ విషయాన్ని తెలుపుతూ పూజా హెగ్డే మరో ట్వీట్ చేసింది. తన డిజిట్‌ టీమ్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపింది. ఎట్టకేలకు తన అకౌంట్‌ తన చేతుల్లోకి తిరిగి వచ్చినట్లు పేర్కొంది. ఇన్‌స్టాలో హ్యాక్ అయిన సమయంలో హ్యాకర్లు చేసిన పోస్ట్‌లను తొలగించానని తెలిపింది పూజా. 2014 మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ‘ముకుంద’ సినిమాతో పూజా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత వరుసగా తెలుగులో పలు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. 1990లో పుట్టిన పూజా ఎంకామ్ చదివింది. 2010లోని విశ్వసుందరి పోటీల్లో పాల్గొని రెండో స్థానంలో నిలిచింది. పూజ సొంతూరు కర్నాటకలోని మంగుళూరు. కానీ పుట్టి పెరిగింది అంతా ముంబైలోనే. తొలిసారిగా 2012 లో తమిళ సూపర్ హీరో సినిమా ముగమూడి అనే సినిమాలో పూజాకు అవకాశం వచ్చింది. ఇప్పుడు ఈ భామ ఇటు టాలీవుడ్, బాలీవుడ్ సినిమా ఆఫర్లతో ఫుల్ బిజీగా మారింది


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/36JfjVW

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....