Sunday, 31 May 2020

ఓ సారి కృష్ణ గారు కార్ ఎక్కించుకొని.. ఆ సంఘటన ఎన్నటికీ మరిచిపోలేను: పూరి జగన్నాథ్

ఈ రోజు (మే 31) సూపర్ స్టార్ కృష్ణ 77వ పుట్టినరోజు సందర్భంగా ఆయన బర్త్ డే విషెస్‌తో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. చిత్రసీమలోని ప్రతి ఒక్క దర్శకుడు, నిర్మాత, నటీనటులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ టాలీవుడ్ లెజెండ్‌తో తమ తమ జ్ఞాపకాలను పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా డాషింగ్ డైరెక్టర్ ఓ ట్వీట్ చేస్తూ అప్పట్లో కృష్ణ గారితో ఉన్న మధుర జ్ఞాపకాన్ని అందరికీ తెలియజేశారు. కృష్ణ ఫోటోను తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ.. ''పాతికేళ్ల క్రితం నేను తీసిన ఫోటో ఇది. ఒకసారి కృష్ణ గారు నన్ను కార్ ఎక్కించుకుని తీసుకెళితే సంగీత్‌లో సినిమా కూడా చూసాం. ఒకప్పుడు ఆయన సినిమాల కోసం క్యూలో నిలుచునే వాడిని, కానీ ఆ రోజు ఆయన పక్కన కూర్చోవడం అస్సలు మరిచిపోలేను. కృష్ణగారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈ గ్రేట్ లెజెండ్ ఆరోగ్యంగా కలకాలం జీవించాలని కోరుకుంటున్నా'' అని పేర్కొన్నారు. ఈ ట్వీట్ చూసిన మహేష్ బాబు ఫ్యాన్స్ పెద్ద ఎత్తున స్పందిస్తూ.. పూరి- మహేష్ కాంబో మరోసారి రిపీట్ కావాలని కోరుతున్నారు. మహేష్ బాబు 28వ సినిమా మీదే కావాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ చేసిన ఈ ట్వీట్‌ని ఛార్మి లైక్ చేయడం విశేషం. దీంతో ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అయింది. ఇకపోతే ఇటీవలే ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కిన పూరి జగన్నాథ్.. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా ఓ మూవీ రూపొందిస్తున్నారు. ముంబై నేపథ్యంలో ప్యాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్యపాండే రొమాన్స్ చేస్తోంది. ఇప్పటికే కొంతభాగం షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ మూవీని మరి కొద్ది రోజుల్లోనే సెట్స్ పైకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు పూరి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Mg0Bw0

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....