Wednesday, 27 May 2020

Jabardasth: జబర్దస్త్ రాకెట్ రాఘవకు పరీక్షలు, స్టాంప్‌తో క్వారంటైన్‌‌కి తరలింపు

మెల్ల మెల్లగా షూటింగ్‌లు మొదలౌతున్నాయి.. దాదాపు రెండు నెలల తరువాత స్టార్ట్, కెమెరా, యాక్షన్ అనే మాట వినిపించబోతుంది. కరోనా మహమ్మారి ప్రభావంతో షూటింగ్‌లు నిలిచిపోవడంతో.. ప్రభుత్వ నిబంధనలు ప్రకారం తిరిగి షూటింగ్‌కు అనుమతులు లభించడంతో నటీనటులు హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. అయితే కరోనా నిబంధనల్లో భాగంగా కమెడియన్ రాకెట్ రాఘవకి వైద్య పరీక్షలు నిర్వహించారు తెలంగాణ డాక్టర్లు. బుల్లితెర ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ టాప్ రేటింగ్‌తో దూసుకుపోతున్న జబర్దస్త్ షూటింగ్ తిరిగి ప్రారంభం కానుండగా.. ఏపీ నుంచి హైదరాబాద్‌కి పయనం అయ్యారు . అయితే సూర్యపేట జిల్లా కోదాడ మండలం నల్లబండ గూడెం శివారులోని సరిహద్దు ప్రాంతం వద్ద వైద్యాధికారులు ఆయనకు పరీక్షలు నిర్వహించారు. అయితే ఆయనలో కరోనా పాజిటివ్ లక్షనాలు లేకపోవడంతో హోం క్వారంటైన్ స్టాంప్ వేసి.. ఇంట్లోనే ఉండాల్సిందిగా సూచించారు. ఇటీవల మరో జబర్దస్త్ కమెడియన్ ఆటో రాంప్రసాద్‌కి సైతం ఇదే సరిహద్దు ప్రాంతంలో వైద్య పరీక్షలు చేసి హోం క్వారంటైన్‌లో ఉంచిన విషయం తెలిసిందే.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2XEIK79

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....