Wednesday, 27 May 2020

ఈ గుండెను మరొక్కసారి తాకిపో తాత.. ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్

ఇవాళ దివంగత సీఎం, స్వర్గీయ నందమూరి తారక రామరావు 97వ జయంతి. ఈ సందర్భంగా ఆయన కుటుంబసభ్యులతో పాటు పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మనవడు, యంగ్ టైగర్ సైతం సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. ‘మీరు లేని లోటు తీరనది’ అంటూ పేర్కొన్నారు. తాత ఎన్టీఆర్‌ ఫోటోతో పాటు.. ‘ మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది, మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది, పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెను మరొక్కసారి తాకిపో తాతా’ అంటూ ఎన్టీఆర్ తాత ఫోటోతో తన ఫీలింగ్స్‌ను ఎన్టీఆర్ షేర్ చేశఆడు. సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు ప్రతీ ఏటా జయంతి రోజున నివాళులు అర్పిస్తుంటారు. కానీ ప్రస్తుతం కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఘాట్ వద్దకు వెళ్లకూడదని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. నటులు జూనియర్ ఎన్టీఆర్,కల్యాణ్ రామ్ ఘాట్ వద్దకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వ లాక్ డౌన్ ఆంక్షలకు సహకరించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తాము ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వెళ్తే మీడియా,పెద్ద ఎత్తున జనాలు అక్కడికి వచ్చే అవకాశం ఉండటంతో.. ఇంటి వద్దే తాతకు నివాళులు అర్పించనున్నట్టు తెలిపారు. అభిమానులు కూడా ఇందుకు సహకరించాలని కోరారు. Read Also:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/36Ab0Mk

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....