Tuesday, 26 May 2020

హీరో సూర్యకు గాయం... తొందరగా నయం కావాలని ఫ్యాన్స్ పూజలు

తమిళ స్టార్ హీరో సూర్యకు కోలీవుడ్‌లోనే కాదు... టాలీవుడ్‌లో కూడా అభిమానులు ఉన్నారు. అందుకే సూర్య సినిమాలు చూసేందుకు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రజలు ఇష్టపడతారు. అయితే అలాంటి అభిమాని హీరోకు గాయాలయ్యాయన్న వార్త ఇప్పుడు ఫ్యాన్స్‌లో ఆందోళన రేకెత్తిస్తోంది. సూర్య వర్కవుట్స్ చేస్తుండగా, ప్రమాదం జరిగి ఆయన ఎడమ చేతికి గాయమైంది. ఈ విషయాన్ని సూర్య సన్నిహితులు, బంధు వర్గాలు నిర్ధారించాయి. దీంతో ఆయన వెంటనే ఆసుపత్రికి వెళ్లి చికిత్స కూడా చేయించుకున్నారని సమాచారం. అయితే గాయం 90 శాతం నయం అయిందని వెల్లడించారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో సూర్య కూడా దీనిపై స్పందించారు. తనకు తగిలిందిపెద్ద గాయం కాదని, అభిమానులు ఆందోళన చెందవద్దని సూచించారు. సూర్యకు గాయాలైనట్టు వార్త బయటకు రాగానే, సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఆయన త్వరగా కోలుకోవాలని పలు ప్రాంతాల్లో ఫ్యాన్స్ పూజలు సైతం చేశారు. సూర్య తొందరగా కోలుకోవాలంటూ పూజలు చేస్తున్నారు. ప్రస్తుతం సూర్య, హరి దర్శకత్వంలో 'అరువా' చిత్రంలో నటిస్తున్నారు. లాక్ డౌన్ ముగిసిన తరువాత సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది. సూర్య ఇప్పటికే సుధ కొంగర దర్శకత్వంలో సూరారై పొట్రు చిత్రాన్ని పూర్తిచేశారు. ఆ చిత్ర విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. అదే విధంగా ఆయన భార్య జ్యోతిక కథానాయకిగా నిర్మించిన పొన్‌మగళ్‌ వందాళ్‌ చిత్రం ఈ నెల 29న ఓటీటీలో విడుదల కానుంది. లాక్‌డౌన్‌ కాలంలో సూర్య వర్కౌట్‌ చేస్తుండగా గాయాల పాలయ్యారనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో జోరుగా సాగుతోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2XwkoN3

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....