బర్త్ డే సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా సినీ నటి , వైసీపీ ఎమ్మెల్యే రోజా కృష్ణకు పుట్టినరోజు విషెస్ తెలిపారు. ‘ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ సెట్టర్ గా పేరు గాంచి నాలాంటి ఎంతో మంది నటులకు స్ఫూర్తిగా నిలిచిన నా అభిమాన సూపర్ స్టార్ కృష్ణ గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు’అంటూ రోజా ట్వీట్ చేశారు. రోజాతో పాటు టాలీవుడ్‌కు చెందిన అనేక ప్రముఖులు కృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన కుమారుడు మహేష్ బాబుతో పాటు, మెగాస్టార్ చిరంజీవి, బండ్ల గణేష్, టాలీవుడ్ దర్శకులు విషెస్ తెలిపారు. కృష్ణ హీరోగా చేసిన మొట్ట మొదటి సినిమా ‘తేనే మనసులు’. ఆ సినిమా నాటికే ఆయనకు ఇందిరతో పెళ్లి అయ్యింది. కృష్ణ పూర్తి పేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. గుంటూరు జిల్లా, తెనాలి మండలములోని బుర్రిపాలెంలో 1942 మే 31న జన్మించారు. ఆగస్టు 11న విడుదలైన గూఢచారి 116 సినిమా సంచలన విజయం సాధించి కృష్ణ కెరీర్ మలుపుతిప్పింది. ఇది తొలి తెలుగు జేమ్స్‌బాండ్ తరహా సినిమా. కృష్ణకు ప్రేక్షకుల్లో ఆంధ్రా జేమ్స్‌బాండ్ అన్న పేరు వచ్చింది. ఈ విజయంతో కృష్ణ ఒకేసారి 20 సినిమాల్లో హీరోగా బుక్ అయ్యాడు. కృష్ణ, ఇందిరలకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు. పెద్ద కొడుకు రమేష్ బాబు హీరోగా కొన్ని సినిమాల్లో పనిచేసి, ప్రస్తుతం సినిమా నిర్మాణం చేస్తున్నాడు. చిన్న కొడుకు తెలుగు సినిమా రంగంలో ప్రముఖ నటునిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. 1967లో బాపు-రమణలు దర్శకత్వం వహించిన సాక్షి సినిమాలో కృష్ణ కథానాయకుడిగా, విజయనిర్మల కథానాయకిగా నటించింది. ఆ తర్వాత సర్కార్ ఎక్స్‌ప్రెస్ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సమయంలో కృష్ణ విజయనిర్మలను ప్రేమిస్తున్నానని పెళ్ళిచేసుకుంటానని చెప్పాడు. పరస్పర అంగీకారంతో మరో రెండేళ్ళకు 1969లో విజయనిర్మలను తిరుపతిలో కృష్ణ రెండో పెళ్ళి చేసుకున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/36NmEE0
No comments:
Post a Comment