Wednesday, 27 May 2020

రోడ్డు ప్రమాదంలో టీవీ నటి మృతి

రోడ్డు ప్రమాదంలో టీవీ వర్ధమాన నటి మృతి చెందింది. మోడల్‌గా కెరియర్ ప్రారంభించినా 22 ఏళ్ల కన్నడ బుల్లితెర నటి మెబీనా మైఖేల్ మృతిచెందింది. కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంగా దాదాపు రెండు నెలలుగా ఇంటికే పరిమితమైన ఆమె.. తాజా సడలింపుల నేపథ్యంలో స్వగ్రామం మెడికెరికి వెళ్లాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో మంగళవారం ఆమె ప్రయాణిస్తున్న కారు దేవీహళ్లి వద్ద అదుపుతప్పి ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మెబీనాతోపాటు ఆమె స్నేహితులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం ఆమె మృతి చెందగా, మెబీనా స్నేహితులు కోలుకుంటున్నారు. మెబీనా మరణ వార్త తెలిసిన ప్యాటే హుదుగిర్‌ హళ్లీ లైఫ్‌ 4 రియాలిటీ షో హోస్ట్ అకుల్ బాలాజీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తన ఫేవరెట్ కంటెస్టెంట్ మరణం తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్నారు. చాలా చిన్న వయసులోనే ఆమె ప్రాణాలు కోల్పోయిందన్నారు. ఈ నిజాన్ని తాను జీర్ణించుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు బాలాజీ. మెబీనా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఆమెకు ట్రోఫీ అందిస్తున్న ఫొటోను షేర్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న బెళ్లూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె మరణ వార్త తెలిసిన వెంటనే కన్నడ టీవీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. మోడల్‌గా కెరియర్ ప్రారంభించిన మెబీనా.. ప్యాటే హుదుగిర్‌ హళ్లీ లైఫ్‌ 4 రియాలిటీ షో టైటిల్‌ కైవసం చేసుకుని అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3c8YcOj

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....