దోమకొండ సంస్థానం వారసుడు, రిటైర్డ్ ఐఏఎస్ కామినేని ఉమాపతిరావు అత్యక్రియల్లో పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడి నుంచి చిరంజీవి, రామ్ చరణ్, ఉపాసన సహా ఇతర కుటుంబ సభ్యులు తృటిలో తప్పించుకున్నారు. కామినేని ఉమాపతిరావు అనారోగ్యంతో ఈనెల 27న మృతి చెందిన విషయం తెలిసిందే. ఈయన ఉపాసన కొణిదెల తాతయ్య. ఉమాపతిరావు అంత్యక్రియలను ఆదివారం నిజామాబాద్ జిల్లాలోని దోమకొండ మండలం కోటలో నిర్వహించారు. ఈ అంత్యక్రియల్లో చిరంజీవి ఫ్యామిలీ పాల్గొంది. అయితే, అంత్యక్రియలకు పార్థివదేహాన్ని తీసుకుళ్తోన్న సమయంలో అక్కడే ఓ చెట్టుపై నుంచి తేనేటీగలు దాడికి దిగాయి. దీంతో అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది కామినేని కుటుంబ సభ్యులతో పాటు చిరంజీవి ఫ్యామిలీని వెంటనే ఇంటిలోకి తీసుకెళ్లారు. తేనెటీగలను అక్కడి నుంచి తరిమికొట్టే ప్రయత్నం చేశారు. ఈ దాడిలో చిరంజీవి, రామ్ చరణ్, ఉపాసన సుక్షితంగా తప్పించుకున్నారు. వీరంతా గాయపడ్డారని మొదట వార్తలు వచ్చినా వాటిలో నిజం లేదు. సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తతో చిరంజీవి ఫ్యామిలీ సురక్షితంగా బయటపడింది. కాగా, తేనెటీగలు కుట్టడంతో నలుగురు స్వల్పంగా గాయపడినట్టు సమాచారం. తేనెటీగలు దాడిచేసే సమయంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ కూడా అక్కడే ఉన్నారు. తేనెటీగలను చెదరగొట్టిన అనంతరం అంత్యక్రియలను కొనసాగించారు. కాగా, చిరంజీవి ఫ్యామిలీపై తేనెటీగలు దాడిచేశాయనే వార్త బయటికి రావడంతో అభిమానులు కాస్త కంగారు పడ్డారు. అయితే, వారంతా సురక్షితంగా బయటపడ్డారని తెలుసుకుని ఊపిరిపీల్చుకుంటున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2XgmOAk
No comments:
Post a Comment