
సంచనల దర్శకుడు '' రూపంలో మరో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే ఈ మూవీ పోస్టర్స్, టీజర్ ద్వారా అలజడి సృష్టించిన ఆయన.. ఇక ఈ మూవీ ట్రైలర్, రిలీజ్ డేట్, సినిమా చూడటానికి కావాల్సిన సొమ్ము ఎంతో చెబుతూ ట్వీట్ చేశారు. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేస్తూ అందులో ఈ వివరాలన్నీ పొందుపర్చారు. గతంలోనే 'క్లైమాక్స్' సినిమాను ఓటీటీ వేదికపై RGVWorldTheatreలో మే 29వ ఉదయం 11 గంటలకు రిలీజ్ చేస్తా అని ప్రకటించిన వర్మ.. దేవుడు కాదు కదా, సాక్షాత్తు కరోనా దిగివచ్చినా 'క్లైమాక్' సినిమాను ఆపలేరని తెలిపిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు ఆ మాటను తీసి గట్టున పెట్టేసిన ఆయన బ్రేకింగ్ న్యూస్ అంటూ మరో డేట్‌ని అఫీషియల్‌గా ప్రకటించాడు. '' 'క్లైమాక్స్' మూవీ జూన్ 6వ తేదీన రాత్రి 9 గంటలకు విడుదల కానుంది. ఈ మూవీని RGVWorld.in/ShreyasET వేదికపై చూడొచ్చు. పే ఫర్ వ్యూ మోడల్‌లో ఈ సినిమాను మీ ముందుకు తెస్తున్నా. ఒక్కో వ్యూ కోసం 100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన లాగిన్ వివరాలు త్వరలోనే ప్రకటిస్తా. ఇక ఈ మూవీ నుంచి మరో ట్రైలర్ రేపు (మే 30) సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేయబోతున్నా. గెట్ రెడీ'' అంటూ ట్వీట్ చేశారు రామ్ గోపాల్ వర్మ. ఆయన పెట్టిన ఈ ట్వీట్‌పై ఫన్నీ మీమ్స్‌తో మిశ్రమంగా స్పందిస్తున్నారు నెటిజన్స్. Also Read: క్రియేటివిటీకి పదును పెడుతూ కరోనా పరిస్థితులను కూడా తనకు అనువుగా మార్చుకొని శృంగార తార మియా మాల్కోవాను 'క్లైమాక్స్' సినిమా ద్వారా మరోసారి రంగంలోకి దించుతున్నారు వర్మ. గతంలో కూడా ఇదే మియా మాల్కోవాతో గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ (GST) సినిమా తీసి సెన్సేషన్ క్రియేట్ చేసిన వర్మ.. ఈ సారి ఎలాంటి సంచలనాలు తీసుకొస్తాడో చూద్దాం.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2zvGG9P
No comments:
Post a Comment