Friday, 29 May 2020

Nirupam Paritala: ‘డైరెక్టర్ తేజా అలా చేసేసరికి చాలా ఏడ్చా’ ఓ చేదు అనుభవాన్ని షేర్ చేసుకున్న డాక్టర్ బాబు!

నటన రంగంలో కళామ్మతల్లిని నమ్మకున్నవారికి నటనే దైవం. నటనే జీవితం. సినిమా అయినా.. సీరియల్ అయినా.. పాత్ర ఏదైనా.. లీనమై జీవిస్తే.. ఆ నటుడ్ని ప్రేక్షకులు అభిమానిస్తూనే ఉంటారు. ఆధరిస్తూనే ఉంటారు. నిజానికి వెండి తెరకంటే బుల్లితెర మీద సెలబ్రెటీస్‌కే ఎక్కువ ఫాలోవర్స్ పెరుగుతున్న రోజులు ఇవి. అయితే ఆయా రంగాల్లో మాత్రం ఆ వ్యత్యాసం కచ్చితంగా చూపిస్తారని, సీరియల్‌లో ఒక్కసారి కనిపిస్తే.. సినిమాల్లో మెయిన్ క్యారెక్టర్‌ ఇవ్వరని, కనీసం ఆడిషన్ కూడా చెయ్యరని, తన జీవితంలోని ఓ చేదు అనుభవాన్ని షేర్ చేసుకున్నారు మన కార్తీకదీపం డాక్టర్ బాబు(). ‘ఎందుకు సినిమాలకు ట్రై చెయ్యకుండా సీరియల్స్ వైపు వచ్చారు? సినిమా హీరోగా ట్రై చెయ్యలేదా మీరు?’ అని అడిగిన ప్రశ్నకు.. నిరుపమ్ ఇలా చెప్పుకొచ్చారు. ‘నేను చాలా కాలం సినిమాల కోసం వెయిట్ చేశాను. అయితే నేను ఎప్పుడూ నాన్నగారు(ఓంకార్ పరిటాల) ఉన్నారనే ధైర్యంతో ఉండేవాడ్ని, ఏదోటి సెట్ చేస్తారులే అనే నమ్మకం ఉండేది. నిజానికి నేను సీరియల్ చెయ్యాలనుకుంటే.. అప్పటికే నాన్నగారి చేతుల్లో రెండు మూడు సీరియల్స్ ఉండేవి. కానీ నేను సినిమానే చెయ్యాలని నిర్ణయించుకున్న తర్వాత సడన్‌గా నాన్నగారు చనిపోవడంతో.. చాలామంది వెల్ విషర్స్.. సీరియల్ అయినా ఫర్వాలేదు స్టార్ట్ చెయ్యి అని చెప్పారు. దాంతో నేను చంద్రముఖీ సీరియల్ స్టార్ట్ చేసేశాను. అదే నా మొదటి సీరియల్. చంద్రముఖీ చేస్తున్న సమయంలో కూడా నేను సినిమాల కోసం ఆడిషన్స్‌కి వెళ్లాను. చంద్రముఖీ షూటింగ్ చేస్తుండగా గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. నేను షూటింగ్ మధ్యలోంచి వెళ్లాను. తేజా గారు నన్ను చూసి.. తినేసి రా అమ్మా టైమ్ పడుతుంది అన్నారు. షూటింగ్ విషయం, సీరియల్ విషయం చెప్పాలో లేదో తెలియక కాసేపు వెయిట్ చేశాను. చివరికి.. ఇలా ఓ సీరియల్‌లో చేస్తున్నానని తేజాగారితో చెప్పేశాను. దాంతో వెంటనే తేజా గారు లోపలికి వెళ్లిపోయాడు. కో డైరెక్టర్ బయటికి వచ్చాడు. ‘మిమ్మల్ని సీరియల్సే చేసుకోమన్నారు. బయలుదేరమన్నారు’ అని చెప్పాడు. ఆ రోజు లిట్రల్లీ ఇంటి వెళ్లి ఏడ్చేశాను. ఏంటో వచ్చేసింది ఏడుపు. సీరియల్ చేస్తున్నానని.. ఆడిషన్ కూడా చేసుకోకుండా పొమ్మాన్నారేంటీ? అని చాలా బాధొచ్చింది ఆరోజు. అయితే సీరియల్‌ వాళ్లని సినిమాల్లోకి తీసుకోకపోవడానికి ఒక్కొక్కరిది ఒక్కో లెక్క. డబ్బులు పెట్టకుండానే సీరియల్ వాళ్లు.. రోజు జనాలకు కనిపించేస్తున్నారు. ఇక రేపు డబ్బులు పెట్టి సినిమా చూడటానికి ఎందుకు వస్తారు? అనేది ఓ లెక్కకనుకుంటాను. కొందరికి గుడ్డి నమ్మకాలు ఉంటూనే ఉంటాయి. అలానే నాకు సినిమాల్లో చాలా ఆఫర్స్ పోయాయి. అష్టాచమ్మా సినిమా ఆడిషన్ టైమ్‌లో కూడా అలానే.. జరిగింది. వాళ్లు ఒక సీన్ ఇచ్చి.. రేపు ఆడిషన్ పెట్టుకుందాం అన్నారు. ఆ రోజు నైటే టీవీలో నా సీరియల్ చూశారట. పొద్దున్నే ఆ డైరెక్టర్ ఫోన్ చేసి.. చూశానమ్మా నైట్ నీ సీరియల్ ఇంకొద్దులే ఆడిషన్ అన్నారు. ఏం అంటాం ఇంకా? అందుకే నేను సినిమాల కోసం తిరగడం మానేశాను. తెలిసిన వాళ్ల ద్వారా ఏదైనా అవకాశం ఉంటే చేస్తున్నానంతే. ఇక సీరియల్స్‌తో కంఫర్ట్ బుల్‌గానే ఉన్నాను. అయినా నేను డెస్టినీని ఎక్కువగా నమ్ముతాను..’ అంటూ చెప్పుకొచ్చారు నిరుపమ్ పరిటాల.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2BggJvm

No comments:

Post a Comment

'I Focused On Studying Charles Sobhraj'

'The opportunity to live as the Serpent excited me.' from rediff Top Interviews https://ift.tt/AtWXqwk