Saturday, 30 May 2020

బాలయ్య Vs నాగబాబు వివాదంలోకి మెగా ప్రిన్స్ ఎంట్రీ.. వరుణ్ తేజ్ వార్నింగ్ ఎవరికి?

‘మేంమంతా ఒక్కటే.. అనవసరంగా మీరే చించుకుంటారు’ అని మహేష్ బాబు లాంటి స్టార్ హీరో బహిరంగంగానే ఫ్యాన్స్‌ని ఉద్ధేశించి మాట్లాడినా.. హీరోల మధ్య చిన్న చిన్న విభేదాలు మాటలు వచ్చినప్పుడు మాత్రం ఫ్యాన్స్ తమ తమ విశ్వరూపం చూపిస్తున్నారు. చొక్కాలు చింపుకుని మరీ.. ఏయ్.. వేసేస్తాం పొడిచేస్తాం అంటూ పోటుగాళ్లలా పిచ్చి పిచ్చి కామెంట్స్ చేసి చివరికి ఎవరినైతే వీళ్లు భుజాన వేసుకుని బయలు దేరారో వాళ్లే భూజాలపై చేతులేసుకుని కిస్సులు పెట్టుకుంటుంటే వీళ్ల కోసమేనా మేం కొట్టుకుచచ్చింది అని సిగ్గు పడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు టాలీవుడ్‌లో బాలయ్య-నాగబాబుల మధ్య వైరం నందమూరి వర్సెస్ మెగా ఫ్యాన్స్ వైరంగా మారింది. తాజాగా ఇండస్ట్రీ పెద్దలు చిరంజీవి నేతృత్వంలో ప్రభుత్వంతో చర్చలు జరపడం.. ఆ చర్చలకు నందమూరి ఫ్యామిలీని దూరం పెట్టడంపై ఫైర్ అయ్యారు బాలయ్య. తనకు ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో తెలియదని.. తనని ఆ చర్చలకు పిలవలేదని.. భూములు పంచుకోవడం కోసమే ఈ చర్చలు జరిపినట్టు ఉన్నారంటూ బాలయ్య చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో దుమారం రేపాయి. అయితే బాలయ్య వ్యాఖ్యలపై మెగా బ్రదర్ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు.. పిలవలేదంటే పిలవలేదని అడగాలి కాని.. రియల్ ఎస్టేట్ అంటూ మాట్లాడటం తప్పు.. మర్యాదగా క్షమాపణ చెప్పాలి లేదంటే బాగోదని వార్నింగ్ ఇచ్చారు నాగబాబు. బాలయ్య వ్యాఖ్యలపై నాగబాబు స్పందన ఆయన వ్యక్తిగతమే అయినా.. నందమూరి ఫ్యామిలీ ప్రస్తావన తీసుకుని రావడంతో రాజధాని భూములు తదితర అంశాలను ప్రస్తావించడంపై వివాదం మరింత ముదిరింది. తరచూ చిన్న విషయానికి పెద్ద విషయానికి నాగబాబు.. బాలయ్యను టార్గెట్ చేయడంపై నందమూరి ఫ్యాన్స్ రియాక్ట్ అయ్యారు. సోషల్ మీడియాలో నాగబాబుని స్నేక్ బాబు, సూసైడ్ స్టార్ అంటూ ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తూ పాత విషయాలని తవ్వితీస్తున్నారు నందమూరి ఫ్యాన్స్. గతంలో బాలయ్య ఎవరో తెలియదు అంటూ కామెంట్స్ చేసిన నాగబాబు ఇప్పుడు ఏ బాలయ్యను క్షమాపణ చెప్పమంటున్నారు అంటూ బూతులు తిడితూ వీడియోలు పెడుతున్నారు బాలయ్య ఫ్యాన్స్. ఇక మెగా ఫ్యాన్స్ కూడా బాలయ్యకు మద్దతు ప్రకటిస్తూ బాలయ్య ఫ్యాన్స్‌‌కి గట్టి కౌంటర్లు ఇస్తున్నారు. మొత్తానికి మెగా-నందమూరి హీరోల ఫ్యాన్స్ వార్ నేపథ్యంలో నాగబాబు సన్.. మెగా ప్రిన్స్ చేసిన ట్వీట్ హాట్ టాపిక్ అవుతోంది. ఎవర్ని అన్నారు.. ఎందుకు అన్నారు.. చెప్పకుండానే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎక్కుపెట్టిన బుల్లెట్ దిగాల్సిన వాళ్లకు దిగిపోయింది. ‘చేతిలో గన్ ఉన్నవాళ్లతో మాట్లాడుకోవడాల్లేవ్’ అంటూ.. గన్ చేతిలో పట్టుకున్న గద్దలకొండ గణేష్ పోస్టర్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు వరుణ్ తేజ్. అయితే సేమ్ టు సేమ్ అంటూ బాలయ్య గన్ పట్టుకుని గిరా గిరా తిప్పుతున్న వీడియోలతో సమాధానం ఇస్తున్నారు నందమూరి ఫ్యాన్స్. ఇక వరుణ్ తేజ్‌ని సైతం ట్రోల్ చేస్తూ బూతులు మొదలుపెట్టారు. ఇక వరుణ్ తేజ్ ట్వీట్‌కి మెగా ఫ్యాన్స్ రియాక్ట్ అవుతూ.. సూపర్ కౌంటర్ అదిరపోయిందన్నా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి బాలయ్య వర్సెస్ నాగబాబు వార్‌లోకి మెగా ప్రిన్స్ ఎంట్రీ ఇవ్వడం వివాదం మరింత రంజుగా మారింది. Read Also:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2yM2OfH

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....