Sunday, 31 May 2020

కృష్ణ పాటకు టీడీపీ ఎంపీ కొడుకు స్టెప్పులు... బర్త్ డేకి స్పెషల్ గిఫ్ట్

కృష్ణ 77వ బర్త్ డే సందర్భంగా ఆయన అభిమానులు కుటుంబసభ్యులు రకరకాలుగా విషెస్ చెబుతున్నారు. తాజాగా అల్లుడు సుధీర్ బాబు కృష్ణ నటించిన అల్లూరి సీత రామరాజు సినిమాలో డైలాగ్స్‌తో అదరగొట్టాడు. తాజాగా 'జుంబారే..జుజుంబ‌రే' పాటకు మ‌హేశ్ బాబు మేనల్లుడు, టీడీపీ ఎంపీ కుమారుడు గ‌ల్లా అశోక్ డ్యాన్స్ చేశాడు. ఈ రోజు సందర్భంగా ఈ పాట ప్రొమోను విడుదల చేశారు. శ్రీ‌రామ్ ఆదిత్య ద‌ర్శ‌కత్వంలో ఓ సినిమాలో ఆయన నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అచ్చం కృష్టలా అశోక్ డ్యాన్స్ చేసి ప్రేక్షకులను అలరించనున్నాడు.ఇందులో హీరోయిన్‌గా నిధి అగర్వాల్ నటిస్తోంది. ఎస్వీ కృష్ణారెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన య‌మ‌లీల సినిమాలో 'జుంబారే' పాటకు ప్రత్యేకంగా కృష్ణ డ్యాన్సుతో అలరిస్తారు. ఈ పాటను బాలసుబ్రహ్మణ్యం పాడగా, సాహిత్యం జొన్న‌విత్తుల అందించారు. ఆ పాట‌లో కృష్ణ సరసన పూజా డ్యాన్స్ చేస్తుంది. కాగా, నటిస్తోన్న కొత్త సినిమాలో జ‌గ‌ప‌తి బాబు, న‌రేశ్‌, స‌త్యా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు చిత్రీకరణ ఇప్పటికే 50 శాతం పూర్తయింది. ఈ సందర్బంగా గల్లా అజయ్ ట్వీట్ కూడా చేశారు. తాత నా ఎవర్ గ్రీన్ లెజెండ్.నాతో పాటు వేలాదిమందికి ఆయన ఆదర్శం. ఆయనను అతిదగ్గరగే చూసే అవకాశం నాకు కల్గినందుకు నేనెంతో అదృష్టవంతుడిని’ అంటూ అజయ్ ట్వీట్ చేశాడు. ‘భలే మంచి రోజు’, ‘శమంతకమణి’, ‘దేవదాస్‌’ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న శ్రీరామ్‌ ఆదిత్య ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ ఫేం నిధి అగర్వాల్‌ కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. జిబ్రాన్‌ బాణీలు అందిస్తున్నారు. రిచర్డ్‌ ప్రసాద్‌ కెమెరా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గల్లా పద్మావతి నిర్మాత. సూపర్‌స్టార్‌ కృష్ణ, గల్లా అరుణకుమారి కలిసి సినిమాను సమర్పిస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/36MVcWO

No comments:

Post a Comment

'I Focused On Studying Charles Sobhraj'

'The opportunity to live as the Serpent excited me.' from rediff Top Interviews https://ift.tt/AtWXqwk