Wednesday, 27 May 2020

పూజా హెగ్డే ఇన్‌స్టాగ్రాం హ్యాక్

ఈ మధ్య సైబర్ నేరాలు పెరిగిపోయాయి. ప్రముఖ సెలబ్రిటీల సోషల్ మీడియా ఎకౌంట్లు హ్యాకింగ్‌కు గురి అవుతున్నాయి. ఆ మధ్య పలువురు సీనియర్ హీరోయిన్ల ఎకౌంట్లు సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ హీరోయిన్ పూజా హెగ్డే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. ఈ విషయాన్ని పూజ తన ట్విట్టర్ వేదికగా అభిమానులకు తెలిపింది. 'నా అకౌంటును ఎవరో హ్యాక్ చేశారు.. కాబట్టి ఆ అకౌంట్ నుంచి వచ్చే ఇన్విటేషన్స్ ను ఎవరూ పట్టించుకోకండి..అలాగే ఎటువంటి వ్యక్తిగత సమాచారాన్ని ఆ అకౌంటుతో పంచుకోకండి' అంటూ పూజా ట్వీట్ చేసింది. 2014 మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ‘ముకుంద’ సినిమాతో పూజా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత వరుసగా తెలుగులో పలు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. నాగ చైతన్యతో కలిసి ‘ఒక లైలా కోసం’ సినిమా చేసింది. ఆ తర్వాత మహేష్ బాబుతో కలిసి ‘మహర్షి’సినిమాలో మెరిసింది. అల్లు అర్జున్‌తో కలిసి దువ్వాడ జగన్నాథం, అలవైకుంఠపురములో సినిమాలు చేసింది. అల వైకుంఠపురములో హిట్‌తో పూజా హెగ్డేకు మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. తాజాగా ఈ భామ టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన నటించే అవకాశం కూడా కొట్టేసింది. వరుసగా యంగ్ హీరోలతో హిట్ సినిమాలు చేస్తూ.. స్టార్ హీరోయిన్ రేసులో దూసుకుపోతోంది పూజా. 1990లో పుట్టిన పూజా ఎంకామ్ చదివింది. 2010లోని విశ్వసుందరి పోటీల్లో పాల్గొని రెండో స్థానంలో నిలిచింది. పూజ సొంతూరు కర్నాటకలోని మంగుళూరు. కానీ పుట్టి పెరిగింది అంతా ముంబైలోనే. తొలిసారిగా 2012 లో తమిళ సూపర్ హీరో సినిమా ముగమూడి అనే సినిమాలో పూజాకు అవకాశం వచ్చింది. ఇప్పుడు ఈ భామ ఇటు టాలీవుడ్, బాలీవుడ్ సినిమా ఆఫర్లతో ఫుల్ బిజీగా మారింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2zt2m6v

No comments:

Post a Comment

Pradyut Bordoloi On Why He Quit Congress To Join BJP

'I could have accepted the humiliation if I wanted to remain as an MP. But I decided to leave.' from rediff Top Interviews https:/...