Saturday, 30 May 2020

Balakrishna: ‘పిచ్చి కుక్కలతో జాగ్రత్త’.. ఫొటోతో మరింత రచ్చ రేపిన నాగబాబు

మెగా బ్రదర్ వెనక్కి తగ్గేట్టు కనిపించడంలేదు. బాలయ్యతో వైరానికి సై అంటే సై అంటున్నారు. ప్రభుత్వ పెద్దలతో ఇండస్ట్రీ పెద్దల మీటింగ్‌కి తనను పిలవ లేదంటూ బాలయ్య చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తూ.. తక్షణమే క్షమాపణ చెప్పాలి లేదంటూ బాగోదు అంటూ గట్టి వార్నింగ్ ఇచ్చారు నాగబాబు. అయితే బాలయ్య మాట్లాడిన తీరు తప్పు కావొచ్చు కాని ఆయన వాదనలో న్యాయం ఉందని అనేవారు కొందరైతే.. రియల్ ఎస్టేట్ లాంటి పదాలను ఉపయోగించాల్సింది కాదంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే నాగబాబు వ్యాఖ్యలపై బాలయ్య ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. స్నేక్ బాబు, సూసైడ్ స్టార్ అంటూ నాగబాబుని ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు. ఎన్నికల ముందు బాలయ్య ఎవరో తెలియదంటూ నోటి కొచ్చినట్టు మాట్టాడిన నాగబాబు.. బాలయ్య ఎవరో తెలియకుండానే క్షమాపణ చెప్పమంటున్నారా? ఇంతకీ నాగబాబు ఏ బాలయ్యకి క్షమాపణ చెప్పమన్నారంటూ సెటైర్లు వేస్తున్నారు. మరికొందరైతే నాగబాబుని పచ్చిబూతులు తిడుతూ బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. నందమూరి ఫ్యాన్స్ అంతా ఏకమై మెగా బ్రదర్ నాగబాబుని టార్గెట్ చేసి ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. ఈ తరుణంలో తనను ట్రోల్ చేస్తున్న వారిని పిచ్చి కుక్కలతో పోల్చుతూ మరో వివాదాస్పద పోస్ట్ చేశారు నాగబాబు. పళ్లు బయటకు పెట్టి అరుస్తూ భయంకరంగా ఉన్న పిచ్చి కుక్క ఫొటోని ట్విట్టర్‌లో షేర్ చేస్తూ.. ఇది పిచ్చి కుక్కల కాలం అంటూ మంట పెట్టే పోస్ట్ పెట్టారు నాగబాబు. ‘పిచ్చి కుక్కలు చాలా డేంజర్.. జాగ్రత్తగా ఉండాలని ప్రజారోగ్యశాఖ చెబుతోంది. అలాంటి కుక్కల్ని నిర్బంధంలోనైనా ఉంచాలి.. చంపేయాలి.. కానీ అలా వదిలేయకూడదు.. అవి జీవితాన్ని బలి తీసుకుంటాయి.. అసలే ఇది పిచ్చి కుక్కల సీజన్’ అంటూ ట్వీట్ చేశారు నాగబాబు. అయితే ఈ ట్వీట్‌కి నందమూరి ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో రియాక్ట్ అవుతూ.. నాగబాబుకి కౌంటర్లు ఇస్తున్నారు. ‘అందుకే పిచ్చి కుక్కలైనా మిమ్మల్ని 1 కి పరిమితం చేసాం. అది కూడా ఇపుడు మా ట్రీట్మెంట్‌తో దారిలోకి వచ్చింది. నీకేమో పాపం కళ్ళు మండుతున్నట్టున్నాయి’ అంటూ కౌంటర్లు ఇస్తున్నారు. పాలకొల్లు, భీమవరం, నర్సాపురం అంటూ పవన్, నాగబాబు, చిరంజీవి ఫొటోలను పెట్టి మరీ వాళ్లు ఓడిపోయిన విషయాన్ని తెలియజేస్తూ.. ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు బాలయ్య అభిమానులు. అయితే మెగా ఫ్యాన్స్ నాగబాబుకి మద్దతు ప్రకటిస్తూ బాలయ్య సినిమాల్లోని డైలాగ్‌లను, ఫొటోలను కామెడీ కోసం వాడేస్తూ ట్రోల్ చేస్తున్నారు. మొత్తానికి అటు బాలయ్య, ఇటు నాగబాబుల కామెంట్స్ నందమూరి వర్సెస్ మెగా ఫ్యాన్స్ మధ్య వైరంగా మారాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/36J2PNN

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...