Sunday, 31 May 2020

పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ.. ఆరుబయటే అతనితో రొమాన్స్.. అబ్బో! ఆ హీరోయిన్ వేషాలు చూస్తే..

హీరోయిన్స్ అన్నాక డేటింగ్ వ్యవహారాలు, బ్రేకప్ సంగతులు, ఆ వెంటనే మరో వ్యక్తితో రొమాంటిక్ టూర్స్ అనేవి కామన్. కానీ డేటింగ్ చేసి ఏకంగా పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ కావడం, పైగా ఆ విషయాన్ని స్వయంగా ప్రకటించడం మాత్రం చాలా అరుదైన విషయం. అయితే ఆ పని చేసి చూపించి సెన్సేషన్ క్రియేట్ చేసిన రోబో బ్యూటీ .. మరోసారి ప్రియుడితో ఆరుబయట రొమాన్స్ చేస్తున్న ఫోటో షేర్ చేసి సంచలనం సృష్టించింది. రీసెంట్‌గా ఓ బిడ్డకు తల్లైన అమీ.. బహిరంగంగా ఇలా రొమాన్స్ చేయడం, పైగా ఆ రొమాంటిక్ పిక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం హాట్ ఇష్యూగా మారింది. హాట్ ఫొటోలు, వీడియోలు, రొమాన్స్‌కు సంబంధించిన పోస్టులు, బోల్డ్ స్టేట్‌మెంట్లు పోస్ట్ చేస్తూ సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ చురుకుగా ఉండే అమీ జాక్సన్.. నాలుగు గోడల మధ్యలో చేసుకునే శృంగార సన్నివేశాన్ని ఆరుబయట పెట్టేసింది. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, మోడల్, యాక్టర్ జార్జ్‌ పనాయొటోతో ప్రేమాయణం కొనసాగిస్తున్న అమీ, అతనితో రెచ్చిపోయి రొమాన్స్ చేస్తోంది. పైగా అందుకు సంబంధించిన పిక్స్ పబ్లిక్‌లో పెట్టేస్తూ రచ్చ రచ్చ చేస్తోంది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అమీ జాక్సన్ పోస్ట్ చేసిన ఫొటోలు చూసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు. ప్రియుడు జార్జ్‌ పనాయొటోతో బహిరంగ ప్రదేశంలో రొమాన్స్ చేస్తూ ఆమె కనిపిస్తుండటం చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఆరుబయట తన ప్రియుడిపై పడుకుని ఉన్న ఫొటో చూసి అబ్బో! ఈ బ్రిటిష్ భామ వేషాలు మామూలుగా లేవుగా అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది. చాలా కాలంగా ప్రియుడు జార్జ్‌ పనాయొటో ప్రేమాయణం సాగిస్తున్న అమీ జాక్సన్.. . 2019 జనవరి 1 తేదీన ఆయనతో నిశ్చితార్థం చేసుకొని సహజీవనం చేస్తోంది. ఈ ఏడాది చివర్లో కానీ, వచ్చే ఏడాది ప్రారంభంలో కానీ వీరి వివాహం జరగనుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. పెళ్లి తర్వాత ఆమె తిరిగి వెండితెరపైకి రీఎంట్రీ ఇవ్వబోతుందని కూడా వార్తలు వస్తున్నాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3ciRaGP

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....