Tuesday, 26 May 2020

వర్మ కొత్త సినిమా.. ఇంట్రస్టింగ్‌ పోస్టర్లు రిలీజ్

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ మరో సంచలన సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. వర్మ డైరెక్షన్‌లో కరోనా వైరస్ అనే సినిమా తీస్తున్నాడు. ఇందుకు సంబంధించిన మరో రెండు ఆసక్తికర పోస్టర్లను ఆయన ఈ రోజు విడుదల చేశారు. కరోనా వైరస్‌ సినిమా నుంచి కుటుంబ దూరం పిక్ విడుదల చేస్తున్నాను. లాక్‌డౌన్‌ నేపథ్యంలో లాక్‌డౌన్‌ గురించి ఈ సీను తీశాను అని ఆయన చెబుతూ ట్విట్టర్‌లో ఓ పోస్టర్ పోస్ట్ చేశారు. ఈ సినిమాకు సంబంధించిన మరో రెండు ఆసక్తికర పోస్టర్లను ఆయన ఈ రోజు విడుదల చేశారు. 'కరోనా వైరస్‌ సినిమా నుంచి కుటుంబ దూరం పిక్ విడుదల చేస్తున్నాను. లాక్‌డౌన్‌ నేపథ్యంలో లాక్‌డౌన్‌ గురించి ఈ సీను తీశాను' అని ఆయన చెబుతూ ట్విట్టర్‌లో ఓ పోస్టర్ పోస్ట్ చేశారు. వర్మ రిలీజ్ చేసిన పోస్టర్‌లో ఇందులో ఓ కుటుంబం తమ ఇంట్లో భోజనం చేస్తుంటుంది. అయితే, అందరూ ఒక్కచోట కూర్చొని తినకుండా భౌతిక దూరం పాటిస్తూ భోజనం చేస్తుంటారు. ఒక్కరు మాత్రమే డైనింగ్‌ టేబుల్‌ వద్ద కుర్చీలో కూర్చొని భోజనం చేస్తుండగా మిగతా వారంతా నిలబడి తింటుంటారు. నవ్వులు పూయించేలా ఈ పోస్టర్ ఉంది. మరో పోస్టర్‌లో ఇద్దరు మాస్కులు పెట్టుకుని ఇంట్లో జాగ్రత్తలు పాటిస్తున్నట్లు ఉంది. అయితే ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్టు వర్మ ప్రేక్షకులకు తెలిపారు. ఇప్పటికే వర్మ పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో సోషల్ మీడియతో చేసిన హడావుడి తెలిసిందే. మాల్కోవా ప్రధాన పాత్రలో ’క్లైమాక్స్’ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అందులో భాగంగా వర్మ ఇటీవలే 'క్లైమాక్స్' కు సంబందించి ట్రైలర్‌ను తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా విడుదల చేశాడు. గతంలో రూపొందించిన ‘జీఎస్టీ’ (గాడ్ సెక్స్ అండ్ ట్రూత్) చిత్రంలో నటించిన మియా మల్కోవాతోనే మళ్లీ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇక ఈ ట్రైలర్ ‌కూడా ఎప్పటిలాగే వర్మ స్టైల్లో ఉండడంతో అభిమానులు ఉత్సహంతో ఉరకలేస్తున్నారు. మరి ఇప్పుడు ట్రైలర్ వర్మ అభిమమానుల్ని ఏ మేరకు ఎంటర్ టైన్ చేస్తుందో చూడాలి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2ZE3QFw

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....