Tuesday, 26 May 2020

ఉపాసన ఇంట విషాదం.. శోకసంద్రంలో కుటుంబం

రామ్ చరణ్ సతీమణి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఉపాసన తాతయ్య కామినేని ఉమాపతి రావు (92) మంగళవారం కన్నుమూశారు. రాత్రి హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. వయస్సు పైబడడం వలన ఆయన తుదిశ్వాస విడిచినట్టు తెలుస్తుంది. తెలంగాణలోని దోమరకొండలో జన్మించిన ఉపాసన తాత ఉమాపతి రావు ఐఏఎస్ ఆఫీసర్‌గా పని చేశారు. మొట్ట మొదటి టీటీడీ ఈవోగా కూడా పనిచేశారు. ఉర్దూలో కూడా ఆయన షాయరీలు (కవితలు) కూడా రాశారని ఉపాసన తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఉమాపతి రావు 1928 జూన్ 15న జన్మించారు. ఆయన మృతితో ఉపాసన భావోద్వేగానికి గురైంది. తన సోషల్ మీడియా పేజ్‌ ద్వారా నివాళులు అర్పించింది. మీరందరు కన్నీటి ద్వారా కాకుండా చిరునవ్వుతో ప్రేమని కురిపించాలంటూ స్పష్టం చేసింది. ఉపాసన సన్నిహితులు, మెగా అభిమానులు ఉమాపతి ఆత్మకి శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2zC1Gvx

No comments:

Post a Comment

Will Hathiram Be Killed In Paatal Lok?

'I insisted only Jaideep could play Inspector Haathiram Chaudhary.' from rediff Top Interviews https://ift.tt/RHLTIwD