Thursday, 28 May 2020

ఇంట్లోనే ఐబ్రోస్ థ్రెడింగ్ చేసుకోండి ఇలా..

ఐబ్రోస్ ట్వీజర్స్ తో ప్లక్ చేసి, వాక్స్ తో ట్రై చేసి, విసిగిపోయి ఉన్నారా? థ్రెడింగ్ ట్రై చేసి చూడండి. కావాల్సిన వస్తువులు దగ్గర పెట్టుకుంటే హ్యాపీగా మీరే స్వయంగా ఐబ్రోస్ చేసుకుని ఆనందించొచ్చు. దీనికి కావాల్సిన ఐటెమ్స్ ఏంటి.. ఎలా చేయాలో తెలుసుకోండి.. కావాల్సిన వస్తువులు 1. మంచి హై-కాటన్ థ్రెడ్ తెచ్చుకోండి. ఈ థ్రెడ్ మీ ముంజేయి దాటి ఇంకో మూడు ఇంచులు ఎక్కువ ఉండేట్లు చూసుకోండి. అంటే అది సుమారుగా 35 సెంటీమీటర్లు, 14 ఇంచులు ఉండాలి. సింథెటిక్ థ్రెడ్ కంటే కాటన్ థ్రెడ్‌తోనే గ్రిప్ గట్టిగా ఉంటుంది. 2. చిన్న ఐబ్రో సీజర్స్ తెచ్చుకోండి. ఎందుకంటే, థ్రెడింగ్ కి ముందు ఐబ్రోస్ ని ట్రిం చెయాలి. ఈ సీజర్స్ చిన్నగా ఉండాలి, షార్ప్ గా ఉండాలి. 3. ఐబ్రో బ్రష్ కావాలి. అది క్లీన్ గా ఉండాలి. 4. ఐబ్రో పెన్సిల్ రెడీగా పెట్టుకోండి. మీకు కావాల్సిన షేప్ డ్రా చేసుకోవడానికి పనికొస్తుంది. మీ ఐబ్రోస్ కంటే డార్కర్ షేడ్ లో ఉన్న పెన్సిల్ తీసుకోండి. ఈ పెన్సిల్ మార్క్ మేకప్ రిమూవర్తో కానీ, వాటర్తో కానీ పోయేలా ఉండాలి. అది కూడా చెక్ చేసుకోండి. 5. అలోవెరా జెల్ గానీ, ఐస్ క్యూబ్స్ కానీ దగ్గరగా పెట్టుకోండి. థ్రెడింగ్ అయిన తర్వాత ఇవి అప్లై చేస్తే హాయిగా ఉంటుంది. థ్రెడింగ్‌కి ముందు.. 1. మంచి లైటింగ్ ఉన్న రూమ్‌లో అద్దానికి ఎదురుగా వస్తువులన్నీ పెట్టుకుని కూర్చోండి. 2. ముందు ఐబ్రో బ్రష్ తో మీ కనుబొమ్మలని పైకి దువ్వండి. ఇప్పుడు మీ ఐబ్రోస్‌లో ఒక పార్ట్ ని బ్రష్‌తో హోల్డ్ చెయ్యండి. బ్రష్ దాటి ముందుకి వచ్చిన హెయిర్ ని సీజర్స్ తో జాగ్రత్తగా కట్ చేయండి. ఇప్పుడు ఐబ్రోస్ ని కిందకి దువ్వి మళ్లీ ఇలానే చేయండి. ఇలా రెండు ఐబ్రోస్‌ని పూర్తిగా ట్రిం చేసిన తరువాత వాటిని మామూలుగా దువ్ండి. ఇప్పుడు మీ ఐబ్రోస్ క్లీన్‌గా, నీట్‌గా కనపడతాయి. 3. ఇప్పుడు ఐబ్రో పెన్సిల్ తో మీకు కావాల్సిన షేప్ డ్రా చేసుకోండి. రెండు కనుబొమలూ ఒకే షేప్ లో డ్రా చేసుకున్నారు కదా అని డబల్ చెక్ చేసుకోండి. థ్రెడ్ చేయటం.. 1. మీరు తయారు గా పెట్టుకున్న థ్రెడ్ ని తీసుకుని రెండు అంచులూ గట్టిగా ముడి వెయ్యండి. 2. దీన్ని ఒక వైపు కదలకుండా పట్టుకుని రెండో వైపు నాలుగైదు సార్లు తిప్పండి. ఇప్పుడు మీ థ్రెడ్ కి మధ్యలో ఒక మెలిక వస్తుంది. 3. ఈ థ్రెడ్ మధ్యలో ని మెలిక దగ్గరగా వచ్చేటట్లూ, దూరం జరిగేటట్లూ ప్రాక్టీస్ చెయ్యండి. ఈ ట్విస్ట్‌ని చాలా సార్లు ప్రాక్టీస్ చేస్తేనే గానీ ఈజ్ రాదు. ఈ మెలిక మధ్యలోనే ఐబ్రో హెయిర్ ఉంచి థ్రెడ్ చేస్తాం. కాబట్టి ఓపిగ్గా ప్రాక్టీస్ చెయ్యండి. 4. ఇప్పుడు ఈ మెలిక మీ ఐబ్రో మీదకు వచ్చేలా గట్టిగా, జాగ్రత్తగా పట్టుకోండి. ఈ మెలిక మధ్యలో మీరు రిమూవ్ చేయాలనుకున్న హెయిర్ ఉంచి ట్విస్ట్ చెయ్యండి. ఎప్పుడూ హెయిర్ గ్రోత్ ఉన్న డైరెక్షన్‌కి ఆపోజిట్ డైరెక్షన్‌లోనే థ్రెడ్ చేయాలని గుర్తు పెట్టుకోండి. 5. ఒక సెక్షన్ హెయిర్ రిమూవ్ చేశాక మరో సెక్షన్ రిమూవ్ చెయ్యండి. ఇలా జాగ్రత్తగా రెండు ఐబ్రోస్ థ్రెడ్ చేయండి. 6. చివరగా అలోవెరా జెల్ గానీ, ఐస్ పాక్ కానీ మీ ఐబ్రోస్ మీద అప్లై చెయ్యండి. ఈ థ్రెడింగ్ ఎంత స్కిల్ ఫుల్‌గా చేసినా అక్కడ స్కిన్ ఇరిటేట్ అవుతుంది. ఓ గంట తర్వాత ఇరిటేషన్ అన్నీ తగ్గిపోతాయి. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. ఎక్కడైనా సరిగ్గా రాలేదనిపిస్తే మళ్ళీ ఇంకొకసారి థ్రెడ్ చేసుకోండి. 7. ఎక్కడైనా చిన్న గ్యాప్స్ ఉన్నాయనిపిస్తే వాటిని ఐబ్రో పెన్సిల్ తో ఫిల్ చేసెయ్యవచ్చు. కేవలం ఐబ్రోస్ మాత్రమే కాదు.. ఫేషియల్ హెయిర్, అప్పర్ లిప్ చిన్, ఇలా రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేస్తుంటే మీకు మీరుగానే బ్యూటీ పార్లర్ వెళ్లే అవసరం లేకుండానే అన్ వాంటెడ్ హెయిర్ రిమూవ్ చేసుకోవడమే కాకుండా, ఐబ్రోస్‌ని షేప్ కూడా చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం ప్రాక్టీస్ చేయండి..


from Beauty Tips in Telugu: అందం చిట్కాలు, Homemade Natural Beauty Tips Telugu - Samayam Telugu https://ift.tt/2X9RhQG

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...