యువ దర్శకుడు తన మూడో సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘అ!’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కొత్త టేస్ట్ పరిచయం చేసి మెప్పు పొందిన ప్రశాంత్ వర్మ.. ఆ తర్వాత 'కల్కి' మూవీతో రెండోసారి ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఇక ఇప్పుడు తాజా పరిస్థితులు, కరోనా విలయతాండవం అంశాన్ని తీసుకొని మూడో సినిమాతో మ్యాజిక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. నేపథ్యంలో ఈ మూవీ ఉండనుందని ప్రకటించిన ఆయన, తాజాగా చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్, ప్రీ లుక్ రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు. నిన్న (మే 28) మూవీ అనౌన్స్‌మెంట్ పోస్టర్ రిలీజ్ చేసిన ప్రశాంత్ వర్మ.. నేడు (మే 29) ఈ మూవీ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసి ఆసక్తి రేకెత్తించారు. నిజమైన సంఘటనల ప్రేరణతో ప్రశాంత్ వర్మ మూవీ అని పేర్కొంటూ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన ఆయన కరోనా వైరస్ ఆరంభ దశలోనే ఉందని చెప్పడం గమనార్హం. కూడలి వద్ద ఉన్న సిగ్నల్‌పై ''స్టే హోమ్.. స్టే సేఫ్'' అని రాసి ఉండటం, నడిరోడ్డుపైనే శవాలు పడి ఉండటం ఈ మోషన్ పోస్టర్‌లో ఆసక్తికర అంశాలుగా మారాయి. దీంతో ఈ మూవీ ద్వారా ప్రశాంత్ వర్మ ప్రజలకు ఏం సందేశం ఇవ్వబోతున్నాడనే దానిపై సర్వత్రా ఆసక్తి మొదలైంది. దేశంలో లాక్‌డౌన్ పూర్తిగా అమల్లోకి రాకముందే ప్రశాంత్ వర్మ ఈ మూవీకి సంబంధించిన 40 శాతం షూటింగ్ పూర్తి చేశాడట. కరోనా వైరస్ భారత్‌కు రాకముందే.. చైనాలో పరిస్థితిని తెలుసుకుని కథ సిద్ధం చేసుకున్నాడట ఈ యువ దర్శకుడు. ఏదేమైనా తొలి రెండు సినిమాల్లోనూ వినూత్నమైన కాన్సెప్ట్‌లు ఎంచుకున్న ప్రశాంత్ వర్మ.. తన మూడో చిత్రంలో కూడా ఏదో కొత్తదనం చూపించబోతున్నారని స్పష్టంగా తెలుస్తోంది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/36DXXti
No comments:
Post a Comment