Sunday, 31 May 2020

సర్కారు వారి పాట.. రికార్డుల వేట: పండగ చేసుకుంటున్న సూపర్ స్టార్ ఫ్యాన్స్

సూపర్ స్టార్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. వరుస హిట్స్ ఖాతాలో వేసుకుంటూ అభిమానులను ఉర్రూతలూగిస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలోనే 'సరిలేరు నీకెవ్వరు' అనిపించుకున్న ఆయన ఇప్పుడు ''తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. నిన్న (మే 31) సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు కానుకగా ఈ మూవీ ప్రీ లుక్ రిలీజ్ చేస్తూ అధికారికంగా టైటిల్ ప్రకటించింది చిత్రయూనిట్. ఎంతో ఆకర్షణీయంగా ఉన్న ఈ ప్రీ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారి 24 గంటల్లోనే రికార్డుల మోత మోగించింది. విడుదలైన తొలి 24 గంటల్లోనే ఎక్కువ రీ ట్వీట్స్ చేయబడిన ప్రీ లుక్ పోస్టర్‌గా, అలాగే ఎక్కువ లైక్స్ సంపాదించిన ప్రీ లుక్ పోస్టర్‌గా రికార్డు సృష్టించింది. అంతేకాదు ఎక్కువ మంది నెటిజన్స్ ఉపయోగించిన టైటిల్ ట్యాగ్ పరంగాను సత్తా చాటుతూ రికార్డుల 'వేలం పాట' మొదలైందని గంట కొట్టి చాటి చెప్పింది. ఇది చూసి సూపర్ స్టార్ అభిమానుల్లో నూతనోత్సాహం చిగురించింది. పండగ చేసుకుంటూ సూపర్ స్టార్ సత్తా అంటే ఇదీ మరీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. Also Read: 'సర్కారు వారి పాట' ప్రీ లుక్ పోస్టర్, ఈ హవా చూస్తుంటే మరో భారీ బ్లాక్ బస్టర్ సినిమా మహేష్ సొంతం కాబోతుందని స్పష్టంగా తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'గీతగోవిందం' ఫేమ్ పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2TY2K3N

No comments:

Post a Comment

Pradyut Bordoloi On Why He Quit Congress To Join BJP

'I could have accepted the humiliation if I wanted to remain as an MP. But I decided to leave.' from rediff Top Interviews https:/...