Tuesday, 26 May 2020

రాముడిగా మహేష్ బాబు.. భలే ఉన్నాడుగా

టాలీవుడ్ ప్రిన్స్, సూపర్ స్టార్ మహేష్ బాబుకు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ హల్ చల్ చేస్తున్నాడు. మహేష్ అభిమాని సృష్టించిన ఓ పోస్టర్ వైరల్ అవుతోంది. ఇందులో ఆయన రాముడిగా కనపడుతున్నాడు. చేతిలో బాణం పట్టుకుని, నీల మేఘ శ్యాముడు స్టైల్‌లో కూల్‌గా మహేశ్ బాబు కనిపిస్తున్నాడు. ‘ యాజ్ ఏ లార్డ్ రామా’ అన్న టైటిల్‌తో ఈ ఫోటోను ఫ్యాన్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. కరోనా విజృంభణ నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో షూటింగులు లేకపోవడంతో ప్రస్తుతం మహేశ్ బాబు ఇంట్లోనే ఈ ఖాళీ సమయాన్ని తమ కుటుంబ సభ్యులతో గడుపుతున్నాడు. 'ఆర్ఆర్ఆర్‌' సినిమా తర్వాత దర్శకుడు రాజమౌళి తన తర్వాతి సినిమాను మహేశ్ బాబుతో చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఆ సినిమాలో మహేశ్ బాబు పాత్రపై ఆసక్తి నెలకొంది. ఒకవేళ రాజమౌళి `రామాయణం` సినిమా చేస్తే ఎలా ఉంటాడో ఊహిస్తూ ఒక అభిమాని పోస్టర్‌ను రూపొందించాడు. ఆ పోస్టర్‌లో రాముడి గెటప్‌లో మహేష్ అద్భుతంగా ఉన్నాడు. ఈ ఫ్యాన్ మేడ్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక దీనిపై మహేష్ అభిమానులు కూడా స్పందిస్తున్నారు. సూపర్ పిక్ అంటూ... రిట్వీట్ చేస్తున్నారు. ఇక విమర్శలు కూడా చేస్తున్న వారు లేకపోలేదు. ఎడిటింగ్ బాగా చేశారంటూ.. కొంతమంది నెటిజన్లు ఎద్దేవా కూడా చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ పిక్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది మహేష్ సినిమాల్లో దేవుడిపై ఏదైనా పాట ఉంటే అది రాముడిపైనే ఉంటుంది. నిజం, శ్రీమంతుడు వంటి మహేష్ సినిమాల్లో రాముడిపై పాటలు ఉండటాన్ని మనం ఇదివరకే గమనించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే మహేష్ మరోవైపు లాక్ డౌన్ సమయాన్ని ఫ్యామిలీతో హ్యాపీగా గడుపుతున్నాడు. ఈ సందర్భంగా ఆయన తన పిల్లలతో తీసుకున్న ఫొటోలు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో అభిమానులను అలరిస్తున్నాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2A8YMhG

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....