Tuesday, 26 May 2020

‘లంచం ఇస్తే దొంగనా**.. ఇవ్వకపోతే మంచోళ్లు’ బండ్ల గణేష్ ట్వీట్‌కి మహేష్ ఫ్యాన్స్ రియాక్షన్

ఈ మధ్య కాలంలో కమెడియన్, నిర్మాత, నటుడు, రిటైర్డ్ యంగ్ పొలిటీషియన్ సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉంటున్నారు. సినిమాల నుంచి రాజకీయాల్లోకి వెళ్లి అంతే వేగంగా వెనక్కి వచ్చి ప్రస్తుతం పౌల్ట్రీరంగంలో వ్యాపారం చేసుకుంటున్న బండ్ల గణేష్ ఇక తనకు సినిమా తప్ప వేరే ప్రపంచం లేదని ఫిక్స్ అయ్యారు. ఇక ఈ మాటపై ఆయన ఎంత వరకూ ఉంటారో తెలియదు కాని.. ప్రస్తుతం అయితే ఇండస్ట్రీ హీరోలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. ఇటీవల గబ్బర్ సింగ్ విడుదలైన 8 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఆ సినిమా దర్శకుడు హరీష్ శంకర్‌తో ట్వీట్ వార్ సాగించారు. బండ్ల వర్సెస్ హరీష్ శంకర్‌ల ట్వీట్ వార్ రంజుగానే సాగింది.. నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటూ వ్యక్తిగత ఆరోపణలు చేసుకుని సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేశారు. అయితే చివర్లో కుటుంబం అన్న తరువాత చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి.. పోతుంటాయి.. అయితే హరీష్‌తో ఇక జన్మలో సినిమా తీసే ప్రసక్తే లేదంటూ కుండబద్దలు కొట్టిన బండ్ల గణేష్ వివాదానికి ముగింపు పలికారు. ఇక ఆయన దేవుడు పవన్ కళ్యాణ్ ఎప్పుడు కబురు పంపితే సినిమా తీయడానికి రెడీగా ఉన్నానంటూ తన దైన శైలిలో పొగడ్తల వర్షం కురిపించిన బండ్ల గణేష్.. తాజాగా మహేష్ ఫ్యాన్స్‌ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. తాజాగా మహేష్ బాబుతో ఆయన కలిసి నటించిన ‘బిజినెస్ మేన్’ చిత్రంలోని పవర్ ఫుల్ క్లిప్పింగ్‌ని ట్విట్టర్‌లో షేర్ చేశారు బండ్ల గణేష్. మహేష్ కాంబినేషన్‌లో ఉన్న సీన్‌‌లో ‘వాళ్లు లంచం ఇస్తే దొంగనాకొడుకులు.. ఇవ్వకపోతే మంచి వాళ్లు’ అంటూ చెప్పే ఫేమస్ డైలాగ్‌ని షేర్ చేసి.. మహేష్ బాబుని ట్యాగ్ చేశారు బండ్ల గణేష్. మొన్నటి వరకూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.. గణేష్ అన్నా.. నువ్ మళ్లీ పవన్‌తో సినిమా తీయాలని ట్వీట్లు చేయగా.. ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ బండ్ల గణేష్ ట్వీట్‌ని రీ ట్వీట్లు చేస్తున్నారు. మీ కాంబో కోసం వెయిట్ చేస్తున్నాం అని కొందరు కామెంట్స్ చేస్తుండగా.. ఇంతకీ ఏం చెప్పాలనుకున్నావ్ అన్నా అంటూ మరికొంత మంది ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి మహేష్ బాబుతో బండ్ల గణేష్ సినిమా.. ఈ కల వచ్చే పదేళ్లలో అయినా తీరుతుందేమో!


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2M12xZh

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....