కరోనా ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న తెలుగు సినిమా పరిశ్రమ కార్మికులు, కళాకారులను ఆదుకునేందుకు మెగాస్టార్ కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ)ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సీసీసీ ఆధ్వర్యంలో సినీ పరిశ్రమలోని రోజువారీ వేతన కార్మికులకు నిత్యావసరాలు సరఫరా చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పరిశ్రమ చెందిన హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఇతర సినీ పెద్దల నుంచి భారీగానే విరాళాలు సేకరించారు. ఇప్పటికే పలు దఫాలుగా నిత్యావసర సరుకుల్ని పంపిణీ చేశారు. తమ్మారెడ్డి భరద్వాజ, ఎన్.శంకర్, మెహర్ రమేష్, బెనర్జీ, సి. కళ్యాణ్ సీసీసీలో సభ్యులుగా ఉండగా.. కరోనా వ్యాప్తి, సినిమా షూటింగ్ తదితర అంశాలపై చర్చించడానికి సీసీసీ శుక్రవారం నాడు మరోసారి భేటీ అయ్యారు. చిరంజీవి ఇంట్లో ఈ భేటీ జరుగనుండగా.. తాజాగా ఇండస్ట్రీ పెద్దలపై బాలయ్య చేసిన వ్యాఖ్యలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆస్తులు పంచుకోవడానికే తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరిపారంటూ బాలయ్య చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో దుమారం రేపగా.. మెగా బ్రదర్ నాగబాబు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. తెలుగు సినిమా పరిశ్రమకు, తెలంగాణ ప్రభుత్వానికి బాలయ్య క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు నాగబాబు. అయితే ఈ సీసీసీ మీటింగ్ తరువాత చిరంజీవి.. బాలయ్య వ్యాఖ్యలపై స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటు సీసీసీ ద్వారా సినీ కార్మికులకు రెండో విడత సాయంపై చర్చిస్తున్నారు. చిరంజీవి ఆధ్వర్యంలో ఏర్పడిన సీసీసీకి బాలయ్య కూడా రూ. 25 లక్షలు విరాళాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2XDedqB
No comments:
Post a Comment