ఒకప్పుడు టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేసిన మెగాస్టార్ చిరంజీవికి బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో మిమ్మల్ని మెగాస్టార్ అనలేం సార్.. అంతకుమించి అని ఆయన పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. కరోనా సృష్టిస్తున్న విలయతాండవంలో ఆదాయం కోల్పోయిన సినీ కార్మికుల కోసం తారలంతా పేదలకు ఆసరాగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ కమిటీ ఏర్పాటు చేసి తెలుగు సినీ పరిశ్రమలోని పేదలందరికీ నిత్యావసర సరుకులు అందిస్తున్నారు. ఈ విషయంపై మెగాస్టార్ చిరంజీవికి కృతజ్ఞతలు తెలియజేస్తూ జేడీ చక్రవర్తి లేఖ రాశారు. ఈ లేఖను ట్విట్టర్ వేదికగా షేర్ చేయడంతో వెంటనే వైరల్ అయింది. అయితే ఈ లేఖలో జేడీ చక్రవర్తి ప్రస్తావించిన విషయాలు చూస్తే.. ''ప్రియమైన చిరంజీవిగారు.. నేను మీ అభిమానినే కానీ అనుచరుడిని కాను. మీమ్మల్ని ఓ కంప్లీట్ యాక్టర్‌గా ఇష్టపడేవాడిని అంతే. నా తరం నటులందరూ మీతో చక్కగా కలిసిపోయేవారు. సాయంత్ర వేళల్లో మీతో కలిసి స్పెండ్ చేయడానికి ఆసక్తి చూపేవారు. కానీ నేనెప్పుడూ అలా చేయలేదు, చేయాలనుకోలేదు. ఇది నేను మీకు రాస్తున్న ఓపెన్ లెటర్'' అంటూ మొదలుపెట్టిన ఆయన కరోనా కల్లోలం, చిరంజీవి సాయం గురించి ప్రస్తావిస్తూ లేఖ కంటిన్యూ చేశారు. కరోనాప్రభావంతో ప్రపంచమంతా అతలాకుతలమైంది. ముఖ్యంగా సినిమా పరిశ్రమ ఎప్పుడూ లేనంతగా కూలబడింది. సినీ కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఇది చాలా దురదృష్టకరం. ఈ పరిస్థితుల్లో ఆర్థిక సమస్యలను మీతో పాటు నేను కూడా ఫేస్ చేస్తున్నాను. అయినప్పటికీ గొప్ప మనసు చేసుకొని మీరు సినీ కార్మికులకు సాయం అందిస్తున్నారు. మీరు చేస్తున్న పని చూస్తుంటే మిమ్మల్ని మెగాస్టార్ అనలేం.. గొప్ప వ్యక్తిగా అభివర్ణించాలి. కొందరు సినీ కార్మికులు నాకు ఫోన్ చేసినప్పుడు తమ కుటుంబాలకు ఎలాంటి ఆకలి సమస్యలు లేవని, చిరంజీవిగారు కావాల్సినంత నిత్యావసర వస్తువులను అందజేశారని తెలిపారు. మీరు ఇండస్ట్రీ రుణం తీర్చుకుంటున్నానని అంటున్నారు కానీ కార్మికుల పట్ల అది మీకున్న గౌరవంగా భావిస్తున్నాను. ఎప్పటికీ మీ అభిమానిని, అనుచరుడిని, మిమ్మల్ని అమితంగా ఇష్టపడే వ్యక్తిని. బెటర్ హ్యుమన్‌గా ఎలా మారాలో మీ దగ్గర నేర్చుకోవాలి అని జేడీ చక్రవర్తి తన లెటర్‌లో పేర్కొన్నారు. Also Read:
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2YtO4wv
No comments:
Post a Comment