Sunday, 2 May 2021

ఇంత క్రేజ్ దాని వల్లే కదా..! అందుకే అదే బెస్ట్ అంటూ మనసులో మాట బయటపెట్టిన రష్మిక మందన

ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ అన్నట్లు వరుస సినిమాలతో బిజీ అయిపోయింది . అందం, అభినయంతో క్రేజీ బ్యూటీగా దర్శకనిర్మాతలకు బెటర్ ఛాయిస్ అవుతున్న ఈ ముద్దుగుమ్మ రెమ్మ్యూనరేషన్ కూడా భారీ గానే పుచ్చుకుంటోంది. కన్నడ సినిమా 'కిరిక్ పార్టీ'తో కెమెరా ముందుకొచ్చిన ఈ భామను 'ఛలో' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు వెంకీ కుడుముల. ఆ తర్వాత అమ్మడి కెరీర్‌లో ఎక్కడా బ్రేక్స్ పడలేదు. తెలుగులో వరుస హిట్స్ పడటమే గాక ప్రేక్షకుల్లో భారీ పాపులారిటీ కూడగట్టుకుంది రష్మిక. 'గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ' సినిమాలతో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా ఎదిగింది. కోలీవుడ్‌లో 'సుల్తాన్' మూవీతో ఎంట్రీ ఇచ్చి అక్కడ నుండి కూడా కొత్త ఆఫర్లు అందుకుంటోంది. అలాగే యంగ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రాకి జంటగా 'మిషన్ మజ్ను, బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ నటిస్తున్న 'గుడ్‌బై' సినిమాల్లో నటిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన చిట్ చాట్‌లో తన సినీ జర్నీ గురించి రియాక్ట్ అయింది రష్మిక మందన. ఎన్ని సినిమాలు చేసినా తన ఆల్ టైమ్ ఫేవరేట్ మూవీ ఫస్ట్ మూవీ 'కిరిక్ పార్టీ'నే అని చెప్పింది. ఇంత క్రేజ్, పాపులారిటీ రావడానికి కారణం తన డెబ్యూ సినిమానే అనేసింది ఈ బ్యూటీ. ఫస్ట్ ఈజ్ బెస్ట్ అందుకే నా ఫస్ట్ సినిమా 'కిరిక్ పార్టీ' అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం అని తెలిపింది రష్మిక. ప్రస్తుతం ఈ అమ్మడు అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'పుష్ప' సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో పల్లెటూరు పిల్లగా రష్మిక సరికొత్త పాత్రలో కనిపించబోతోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3nEUBPm

No comments:

Post a Comment

'I Don't Want To Let Down The Economy...'

'This Budget has a one-year agenda, which you can call the sprint, and the marathon is towards Viksit Bharat.' from rediff Top Int...