మహానటుడు నందమూరి తారక రామారావుకు భారతరత్న ఇవ్వాలంటూ చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు తెలుగు ప్రేక్షకులు. తాజాగా మెగాస్టార్ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ పోస్ట్ పెట్టారు. నేడు (మే 28) జయంతి సందర్భంగా ఆయన తన సోషల్ మీడియా ఖాతాల్లో ఎన్టీఆర్ గొప్పతనాన్ని, ఆయన సేవలను స్మరించుకుంటూ పోస్ట్ పెట్టారు. చిరంజీవి చేసిన ఈ పోస్ట్ వెంటనే వైరల్ అయింది. ఈ పోస్ట్‌పై మెగా, నందమూరి అభిమానులు లైకుల వర్షం కురిపిస్తున్నారు. ''ప్రముఖ గాయకులు నవయుగ వైతాళికులు భూపేన్ హజారికా గారికి మరణానంతరం భారతరత్న ఇచ్చినట్టు, మన తెలుగు తేజం, దేశం గర్వించే నాయకుడు గారికి భారత రత్న ఇస్తే అది తెలుగు వారందరికీ గర్వకారణం. వారి నూరవ జన్మదినం దగ్గర పడుతున్న సందర్భంగా ఎన్టీఆర్ గారికి ఈ గౌరవం దక్కితే అది తెలుగు వారికి దక్కే గౌరవం. ఆ మహానుభావుడి 98వ జన్మదిన సందర్భంగా వారిని స్మరించుకుంటూ.. మీ చిరంజీవి'' అని పేర్కొన్నారు మెగాస్టార్. మరోవైపు విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు జీవిత చరిత్రను పాఠ్యాంశంగా తీసుకురావాలని ఆయన కుమారుడు, స్టార్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. నేడు (శుక్రవారం) ఉదయం హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళుర్పించిన ఆయన.. పేదల పెన్నిది, యుగ పురుషుడు ఎన్టీఆర్ అని అన్నారు. ఆయన జీవితంపై ఎంతో మంది పుస్తకాలు రాశారని తెలిపిన బాలయ్య బాబు వాటిని నేటితరం విద్యార్థులకు పాఠ్యాంశాలుగా తీసుకురావాలని అన్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3vw1qWv
No comments:
Post a Comment