ఆలు లేదు.. చూలు లేదు.. కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా ఉంది సినీ నటి తీరు చూస్తే. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా కరోనా మెడిసిన్‌పై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఆనందయ్య ఆయుర్వేద మందు పనిచేస్తుందని.. కరోనా నుంచి కోలుకుంటున్నారని అనేకమంది చెప్తుంటే.. అసలు అది మందే కాదని పసరు, వంటకం.. దానికసలు శాస్త్రీయత లేదు.. అది ఆయుర్వేదమే కాదంటూ విమర్శలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఉన్న రచ్చ చాలనదన్నట్టుగా ఆనందయ్య కుల ప్రస్తావన తీసుకుని వస్తూ ‘ఇలాంటి రత్నం మా కులంలో పుట్టినందుకు గర్వంగా ఉందని ఈ రత్నానికి భారతరత్న ఇచ్చేయాలంటూ తన కులాభిమానాన్ని చూపించారు కరాటే కళ్యాణి. దీనికి సంబంధించిన ఫేస్ బుక్‌లో వీడియో పెట్టగా.. కరాటే కళ్యాణిని ఓ రేంజ్‌లో ఏకిపారేస్తున్నారు నెటిజన్లు. ‘కుల ప్రస్తావన అవసరమా?? ప్రశాంతంగా ఉన్న కృష్ణపట్నం లో మీరు కులాల మధ్య చిచ్చు పెట్టకండి.. ఈ పరిస్థితుల్లో జై యాదవ్ అని అనడం అవసరమంటారా? మీ మీదా ఉన్న గౌరవం పోయేట్టు ఉంది మీ మాటలకు.. ఆసుపత్రికి వేళ్లేటపుడు డాక్టర్ యాదవ్ అని, డాక్టర్ రెడ్డి అని వెళ్లితే మనం పోతాం’ అంటూ నెటిజన్లు కరాటే కళ్యాణికి చురకలేస్తున్నారు. ఇంతకీ కరాటే కళ్యాణి ఏమన్నదంటే.. ‘భారత రత్నాన్ని దాచేస్తే ఎలా?? నేనూ పూర్తి మాద్దతు ఇస్తున్నా.. మా అన్నకే జై ఆనందయ్యా.. ఎప్పుడూ నేను కులం గురించి మాట్లాడను కానీ.. నేను యాదవ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షురాలిగా ఉన్నాను. ఇప్పుడు నాకు యాదవ్ అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది. నా జాతిలో ఆనందయ్య పుట్టినందుకు గర్వంగా ఉంది. కరోనా అంటే భయపడిపోతున్న టైంలో.. కలియుగ ఆపద్భాందవుడులా ఆనందయ్య వచ్చాడు. ఒక వ్యక్తి శక్తిగా మారి.. లక్షల మందికి నిమిషాల్లో కరోనా తగ్గిస్తున్నాడు. పొర్లు దండాలు పెడుతున్నారు ఆయనకి. ఈరోజు ప్రభుత్వం ఆనందయ్యని నిర్భంధించి తరువాత ఈ మందుని పంపిణీ చేస్తాం అంటున్నారు. నిజంగా మా జాతిలో పుట్టారు కాబట్టి ఆనందయ్య రత్నం అనే అంటాము. ఇలాంటి రత్నాలకు భారతరత్న ఇవ్వాలి.. యాదవజాతి ముద్దుబిడ్డ ఆనందయ్య.. అతని మా జాతిలో పుట్టడం గొప్ప అని చెప్పడంలో తప్పేంలేదు. మేం చెప్పుకుంటాం.. మా వాడు అని ఎందుకు గర్వంగా చెప్తున్నా అంటే.. ఆయన మా ఒక్క యాదవులకే ఉపయోగపడలేదు.. ప్రపంచానికి ఆయన కావాల్సిఉంది. దయచేసి సీఎం జగన్ గారు చొరవ తీసుకుని ఆనందయ్య మందుని సామాన్యులకు అందుబాటులో తీసుకుని రండి. అది చెట్ల మందు.. పసరు మందు.. లాంటి మాటలు పక్కనపెట్టి తొందరగా ఆనందయ్య మందుని అందుబాటులోకి తీసుకుని వస్తే.. కొన్ని కోట్లమంది ప్రాణాలను కాపాడిన వాళ్లు అవుతారు. ఆనందయ్య గారూ మీ వెనుక మేం ఉన్నాం.. మనుషుల్లో దేవుడు మీరు.. మీరు ఇంకా ఉన్నతి శిఖరాలను చేరుకోవాలని ఆశిస్తూ మీ చెల్లి కరాటే కళ్యాణి’ అంటూ ఫేస్ బుక్‌లో పోస్ట్ షాకింగ్ పోస్ట్ పెట్టింది కరాటే కళ్యాణి.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3unPGnG
No comments:
Post a Comment