Monday, 31 May 2021

Pawan Kalyan Son: వైరల్ పిక్.. కొడుకుతో కలసి పవర్ స్టార్ ‘సరిగమప’.. వీడు ఆరడుగుల బుల్లెట్

వీడు ఆరడుగుల బుల్లెట్టూ.. అంటే పవన్ కళ్యాణ్‌కి పెద్దగా సెట్ కాలేదు కానీ.. పవన్ కొడుకు అఖిరానంద్‌కి మాత్రం పర్ఫెక్ట్ సూట్ అవుతుంది. జూనియర్ పవర్ స్టార్ మరీ ఇంత లెంగ్త్ ఉన్నాడేంటి అనేట్టుగా ఉన్నాడు తాజా ఫొటోలో. రేణూదేశాయ్‌తో విడిపోయినప్పటికీ పిల్లలు అఖిరా, ఆద్యల్ని తరచూ కలుస్తుంటారు పవన్ కళ్యాణ్. తాజాగా మరోసారి పవన్-అకిరా కలుసుకున్నారు. ఈ సందర్భంగా దిగిన ఫొటో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. పక్కన ఆరగుగుల బుల్లెట్ మాదిరిగా ఉన్నాడు అకిరా. తండ్రిపక్కన ఎంతో వినయంగా కనిపించి పవర్ స్టార్ అభిమానుల్ని ఫిదా చేశాడు . ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ తన కొడుకు అకిరానందన్‌తో కలిసి సంగీతం నేర్చుకుంటున్నారట. ఇందుకోసం ఓ మ్యూజిక్ టీచర్‌ని కూడా పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియాలో ఆనందాన్ని పంచుకుంటూ.. పవన్ కళ్యాణ్ అతని తనయుడు అకిరా తన వద్ద సంగీతం నేర్చుకుంటూ తనకి శిష్యులు కావడం చాలా ఆనందంగా ఉందని.. ఈరోజు వాళ్లకి డెమో క్లాస్ ఇవ్వడం జరిగిందని.. పవన్ కళ్యాణ్ గారి ఇంట్లోనే ఈ డెమో ఇచ్చానని చెప్పారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారితో కొన్ని గంటల పాటు మాట్లాడే అవకాశం లభించిందని.. ఆయన వయొలిన్ బాగా వాయిస్తారని నా డెమో క్లాస్ కూడా ఆయనకు నచ్చింది అంటూ ఆనందం వ్యక్తం చేశారు సంగీత టీచర్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3c55vcO

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....